Begin typing your search above and press return to search.
రోడ్ యాక్సిడెంట్లపై ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు వింటే అవాక్కే!
By: Tupaki Desk | 3 Nov 2019 4:19 AM GMTఅడ్డదిడ్డంగా మాట్లాడే నేతలు కొందరు ఉంటారు. మెదడు మోకాలిలో ఉన్నట్లుగా అనిపించే వారి మాటలు తరచూ సంచలనాలుగా మారుతుంటాయి. తాజాగా అదే తరహా వ్యాఖ్యలతో జనాలకు షాకిస్తున్నారు అసోంకు చెందిన బీజేపీ ఎంపీ. అతగాడి వ్యాఖ్యలు విన్న వారంతా విరుచుకుపడటమే కాదు.. అతడ్ని తిట్టి పోస్తున్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే.. చక్కగా ఉన్న రోడ్లు కనిపించవు. అన్నింటికి మించి వర్షాకాలంలో వాహనదారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే వణికేలా కొన్ని రోడ్లు ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన ఇంత కాలమయ్యాక కూడా చక్కటి రోడ్లు లేకపోవటం ఏమిటి? దేశ వ్యాప్తంగా మంచి రోడ్లు ఎప్పటికి సాధ్యమనే మాటకు నేతల నోటి నుంచి సమాధానం రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఊహించనిరీతిలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్. అసోంలో దారుణంగా ఉన్న రోడ్ల గురించి మీడియా ప్రశ్నించిన వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. మంచి రోడ్లను నిర్మించే ప్రసక్తే లేదు.. ఎందుకంటే గుంతల రోడ్ల వల్లే ప్రమాదాలు తగ్గుతాయి అంటూ వివాదాస్పద వివరణ ఇచ్చారు.
రోడ్ల మీద గుంతలు ఎక్కువగా ఉంటే.. యువత తమ వాహనాల్ని నెమ్మదిగా నడుపుతారని.. దాంతో ప్రమాదాలు తగ్గుతాయని సమర్థిస్తూ మాట్లాడారు. అంతేకాదు.. మంచి రోడ్లు ఉంటే.. వాహనాల్ని దూసుకెళ్లేలా చేస్తారని.. దీని కారణంగా ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉందంటూ సెలవిచ్చిన సదరు బీజేపీ ఎంపీ మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అయ్యగారి మాటలు వింటే.. మెదడు మోకాలిలో ఉన్న వైనం కొట్టొచ్చినట్లు కనిపించట్లేదు?