Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టేసిన బీజేపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   7 March 2019 5:03 AM GMT
ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టేసిన బీజేపీ ఎంపీ!
X
అధికార‌.. విప‌క్ష నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఎలానో.. సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య పంచాయితీలు రాజ‌కీయాల్లో మామూలే. ఒకే పార్టీలో ఉన్నా క‌డుపులో క‌త్తులు పెట్టుకొని తిరిగేటోళ్లు.. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా తొక్కేసే తీరు మామూలే. అయితే.. ఇవ‌న్నీ గుట్టుగా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చేశాం. కానీ.. దీనికి భిన్నంగా ఒక అడుగు వేసి మ‌రీ.. సొంత పార్టీ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టేసి.. బూతులు తిట్టేసిన బీజేపీ ఎంపీ య‌వ్వారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ లో చోటు చేసుకున్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ఈ య‌వ్వారంలోకి వెళితే.. సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లా అభివృద్ధి క‌మిటీ మీటింగ్ కు బీజేపీ ఎంపీ శ‌ర‌ద్ త్రిపాఠీ.. ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ హాజ‌ర‌య్యారు. స్థానికంగా నిర్మించాల్సిన రోడ్డుకు సంబంధించిన శిలాఫ‌ల‌కంపై త‌న పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శ‌ర‌ద్ త్రిపాఠీ స్థానిక ఎమ్మెల్యే రాకేష్ సింగ్ ను ప్ర‌శ్నించారు.

దీనిపై ఇరువురు నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది అంత‌కంత‌కూ పెరుగుతూ పోయి.. ఇరువురి మ‌ధ్య తీవ్ర‌స్థాయికి చేరింది. ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఈ స‌మ‌యంలో స‌హ‌నం కోల్పోయిన బీజేపీ ఎంపీ శ‌ర‌ద్ త్రిపాఠి త‌న కాలికి ఉన్న షూ తీసుకొని ఎమ్మెల్యేపై ఒక్క‌సారిగా దాడి చేశారు. దీనికి ప్ర‌తిగా ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ప్ర‌తిదాడికి దిగారు.

ఈ ఇరువురు నేత‌ల గొడ‌వ‌కు పార్టీ నేత‌లు ఒక్క‌సారిగా అవాక్కు అయ్యారు. అధికారులు సైతం వారిని శాంతించే క్ర‌మంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇష్యూ కొట్టుకునే వ‌ర‌కూ వెళ్ల‌టంతో పోలీసులు ఎంట‌ర్ అయి ఇరువురు నేత‌ల్ని బుజ్జ‌గించారు. దీంతో వ్య‌వ‌హారం అదుపులోకి వ‌చ్చింది. ఈ ఇష్యూలో మ‌రో స్పెష‌ల్ ఏమంటే.. రాష్ట్ర మంత్రి అశుతోష్ టండ‌న్ స‌మ‌క్షంలోనే ఎంపీ.. ఎమ్మెల్యేల గొడ‌వ జ‌రిగింది. అధికార ప‌క్ష నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ ర‌చ్చ యూపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి.. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టి ఎంపీపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఏంది మోడీసాబ్‌.. మ‌న పార్టీ నేత‌లు మ‌రీ ఇంత‌గా చెల‌రేగిపోతున్నారేంది?