Begin typing your search above and press return to search.
మహారాష్ట్ర - హర్యానా ఫలితాల ఎఫెక్ట్ ..బీజేపీకి భారీగా తగ్గనున్న ఎంపీలు
By: Tupaki Desk | 26 Oct 2019 1:30 AM GMTమహారాష్ట్ర - హర్యానాలో జరిగిన ఎన్నికలలో బీజేపీ తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది. మహారాష్ట్ర లో శివసేన తో పొత్తుపెట్టుకొని అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ .. హర్యానా లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రులతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెరవెనుక మంతనాలు ప్రారంభించింది. ఎదో ఒక విధంగా ప్రస్తుతానికి గట్టెక్కినా కూడా వచ్చే రోజుల్లో బీజేపీకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాలి. హర్యానా - మహారాష్ట్రలో అత్యధిక సీట్లు రాబట్టినా కూడా బీజేపీ కి ఉన్న బలంతో పోల్చితే అది తక్కువే అవుతుంది. ఇదే ఇప్పుడు బీజేపీ కొంపముంచుతుందా అని అనిపిస్తుంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీకి తిరుగులేదు. కానీ , రాజ్యసభ లో మాత్రం వచ్చే కొన్ని రోజుల్లో బీజేపీ బలం బాగా తగ్గిపోనుంది అని తెలుస్తుంది.
ప్రస్తుతం బిజెపి రాజ్యసభ ఎంపీల సంఖ్య 82 కాగా.. కాంగ్రెస్ సంఖ్య 45 . తాజాగా మహారాష్ట్ర - హర్యానా లో జరిగిన ఎన్నికలలో బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకొని ఉంటె రాజ్యసభ లో బీజేపీ బలం మరింతగా పెరిగి ఉండేది. అయిదేళ్ళుగా అధికారంలో వున్నప్పటికీ.. బిజెపికి ఇటీవలనే రాజ్యసభలో సంఖ్యాబలం సమకూరింది.
ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి మొత్తం 19 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ప్రస్తుతం వారిలో 11 మంది ఎన్డీఏ(బిజెపి-శివసేన) - ఏడుగురు యుపిఏ (కాంగ్రెస్-ఎన్సీపీ) పక్షాన వున్నారు. అదే సమయంలో హర్యానా నుంచి మొత్తం అయిదుగురు రాజ్యసభ సభ్యులుంటే.. బిజెపి తరపున ముగ్గురు - కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కరు.. ఇండిపెండెంట్ గా మరొకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటె వచ్చే రెండేళ్ళలో మహారాష్ట్ర కి చెందిన 13 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ కాబోతున్నారు. వారిలో ఏడుగురు ఎన్డీఏకు - ఆరుగురు యుపిఏకు చెందినవారు ఉన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం హర్యానాలో ఒక రాజ్యసభ సభ్యున్ని గెలిపించుకోవాలంటే 30 మంది ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో 36 మంది ఎమ్మెల్యేలు కావాల్సి వుంటుంది. ఈ లెక్కన హర్యానాలో 2020లో కోల్పోతున్న రెండు స్థానాలకు గాను బిజెపి ఒక్కదానినే తిరిగి పొందే అవకాశం ఉంది. అలాగే మహారాష్ట్రలో ఏడుగురి పదవీ కాలం ముగుస్తుండగా ... ఎన్డీఏ కూటమి కేవలం నలుగురిని మాత్రమే తిరిగి గెలిపించుకునే పరిస్థితి ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు పొందిన బిజెపి.. 2020 - 2022 రాజ్యసభ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తుంది. చత్తీస్ గఢ్ లో బిజెపికి కేవలం 15 మంది ఎమ్మెల్యేలుండగా.. ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపే పరిస్థితి లేదు. రాజస్థాన్ లో మొత్తం 73 మంది ఎమ్మెల్యేల బలం వున్న బిజెపి అక్కడా ఒక్కరికి మించి రాజ్యసభకు పంపలేదు. అలాగే మధ్యప్రదేశ్ లో బిజెపికి 109 ఎమ్మెల్యేలుండగా.. అక్కడ ఒక్కో రాజ్యసభ సభ్యున్ని ఎన్నుకోవాలంటే 58 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా.. ఆ రాష్ట్రం నుంచి కూడా ఒక్కరినే రాజ్యసభకు పంపే పరిస్థితి.
ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు… ట్రిపుల్ తలాఖ్ - ఆర్టికల్ 370 రద్దు - కశ్మీర్ విభజన వంటి బిల్లుల విషయంలో రాజ్యసభలో వున్న బలాన్ని చూసుకునే తీసుకున్నారు. మొదటగా రాజ్యసభలో బిల్లుని ఆమోదింపచేసుకొని ..ఆ తరువాత లోక్ సభలో ప్రవేశపెట్టి గట్టెక్కారు. కానీ , వచ్చే రెండేళ్ల లో బీజేపీ బలం తగ్గిపోతుండటంతో మోడీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్న కూడా కొంచెం ఆలోచించాల్సిందే.