Begin typing your search above and press return to search.
సీఎం జగన్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 3 April 2021 8:26 AM GMTఏపీలో తిరుపతి ఉప ఎన్నిక పోరు తారస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే.. కొందరు నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్ మాట్లాడినట్టుగా చెబుతున్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
తిరుపతిలో అధికార వైసీపీ విజయం దాదాపుగా ఖరారైపోయిందనే ప్రచారం సాగుతోంది. మెజారిటీ ఎన్ని లక్షలు వస్తుందన్నదే తేలాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలన్నీ సెకండ్ ప్లేస్ కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం ద్వారా.. జనం చూపు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయ పడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకోవడంతో.. ఓటమి భయంతోనే బహిష్కరణ డ్రామాలు ఆడుతోందని అంటున్నారు. దీంతో.. తిరుపతి పోరులోనూ అధికార పార్టీకి తామే ప్రధాన పోటీ అని ప్రచారం చేసుకుంటోంది బీజేపీ.
అయితే.. దూకుడు మంత్రాన్ని పాటించడం ద్వారా నాలుగు ఓట్లు రాబట్టొచ్చని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందని, త్వరలోనే జగన్ జైలుకు పోవడం ఖాయమని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతేకాకుండా.. త్వరలోనే రౌడీ సీఎం పని అయిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి జనం తగిన బుద్ధి చెబుతారని అంటున్నట్టు సమాచారం.