Begin typing your search above and press return to search.
బీజేపీ నయా స్కెచ్.. బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు యాప్ రెడీ!
By: Tupaki Desk | 6 Jan 2023 4:33 AM GMTవచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ వారిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో సాంకేతికను వాడుకోవడంలో బీజేపీ దిట్ట. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకొని సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే చేసి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను దెబ్బకొట్టనున్నారు. ఇందులో భాగంగా ‘సరళ్’ అనే ప్రత్యేక యాప్ ను ప్రవేశపెట్టనున్నారు. సంఘటన్ రిపోర్టింగ్ అండ్ అనాలసిస్ ను షార్ట్ కట్ తో ‘సరళ్’గా పేరు పెట్టారు. దీని ద్వారా దిగువ శ్రేణి కార్యకర్తల నుంచి జాతీయ నేతల వరకు పార్టీ యాక్టివిటీని ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు. సరళ్ ను శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజల్లోకి చొచ్చుకుపోతూ వారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. అయితే పార్టీ కేడర్ ను మరింత బలపర్చేందుకు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకోనున్నారు.
బూత్ లెవల్లో ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ‘సరళ్’ యాప్ ను రూపొందించారు. బూత్ స్థాయి నుంచి జాతీయ నేతల వరకు ఈ యాప్ లో సభ్యులుగా ఉండనున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర సమాచారాన్ని అప్ డేట్ చేయనున్నారు. నియోజకవర్గానికో సోషల్ మీడియా కన్వీనర్ ను ఇప్పటికే నియమించారు. ఇక ఈ యాప్ మొత్తం దేశ నాయకత్వం కనుసన్నల్లోనే నడవనుంది. కమిటీ సభ్యులతో నేరుగా టచ్ లోకి రావడానికి ఇది సహకరిస్తుంది.
సాంకేతికను పుచ్చుకోవడంలో బీజేపీ మిగతా పార్టీల కంటే ముందే ఉంటోంది. గతంలో ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరయ్యారు. అంతేకాకుండా రకరకాల మీమ్స్, వీడియోలను తయారు చేసి ప్రచారం చేశారు. వీటిని ప్రతి ఒక్క మొబైల్ లోకి పంపేలా యూత్ ను ఎంకరేజ్ చేశారు. ఇలా సోషల్ మీడియాను బాగా వాడుకొని ఎన్నో సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ అధికారంలోకి రావడానికి ‘సరళ్’ యాప్ ఉపకరిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు అంటున్నారు.
సరళ్ యాప్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉంది. ఇటీవల గుజరాత్ ఎన్నికల సందర్భంగా కమలనాథులు దీనిని బాగా ఉపయోగించారు. మారుమూల గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అని తెలుసుకోవడానికి ఇది సహకరించింది. ఎప్పటికప్పుడు బూత్ లెవల్ కార్యకర్తలు సమాచారం అప్ డేట్ అయింది.
దీంతో ప్రజల నాడిని పట్టిన బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అటు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఈ యాప్ ను ఉపయోగించారు. అయితే అక్కడ అధికారంలోకి రాకున్నా.. ఓట్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో దీనిని ఉపయోగించి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టనున్నట్లు రాష్ట్ర నాయకులు తెలుపుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.