Begin typing your search above and press return to search.

నిరాశా పవనాలు.. కమలం వ్యూహానికి బ‌లేనా?

By:  Tupaki Desk   |   13 March 2021 8:26 AM GMT
నిరాశా పవనాలు.. కమలం వ్యూహానికి బ‌లేనా?
X
‘రాజ‌కీయంలో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయి.’ అనేది నానుడి. పవన్ బీజేపీతో దోస్తీ ద్వారా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడా? అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను రెండు స్థానాల్లో పోటీ చేసిన‌ప్ప‌టికీ.. ఓడిపోయాడు. ఆ త‌ర్వాత బీజేపీతో మ‌రింత ద‌గ్గ‌రైన జన‌సేన‌.. క‌మ‌ల ద‌ళంతో దోస్తీ చేయ‌డం ద్వారా ప్రాబ‌వం పెంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే.. ఈ పొత్తు ప‌వ‌న్ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్టు ఏ కోశానా క‌నిపంచ‌ట్లేదు. గ‌తంలో తెలంగాణ‌లోని హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌ప‌డ్డారు జ‌న‌సేనాని. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన త‌ర్వాత బ‌రిలో నుంచి మిడిల్ డ్రాప్ అవ్వాల్సి వ‌చ్చింది. పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని బీజేపీ గ‌ట్టిగా చెప్ప‌డం వ‌ల్లే వెన‌క్కు త‌గ్గార‌నే వార్త‌లు వ‌చ్చాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఛాన్స్ ఇస్తామ‌ని హామీఇచ్చార‌ట బీజేపీ పెద్ద‌లు.

నిన్నామొన్న‌టి వ‌ర‌కు తిరుప‌తి ఉప పోరులో జ‌న‌సేన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపేందుకు శ‌తవిధాలా ప్ర‌య‌త్నించారు ప‌వ‌న్‌. ఇందుకోసం ప‌లుమార్లు ఢిల్లీ కూడా వెళ్లివ‌చ్చారు. బీజేపీ పెద్ద‌లో భేటీ అయ్యి.. తిరుప‌తి స్థానం త‌మ‌కు కావాల‌ని గ‌ట్టిగా కోరారు. కానీ.. ఇప్పుడు చూస్తే.. తాము స్వ‌చ్ఛందంగా పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఇదేంటీ.. ప‌వ‌న్ ఇలా చెప్ప‌డ‌మేంటీ? అని జ‌న‌సైనికులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. తిరుప‌తి అభివృద్ధి కోస‌మే తాము పోటీ నుంచి త‌ప్పుకును బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు ప‌వ‌న్‌. ఇందులో క‌వ‌రింగ్ త‌ప్ప‌, వాస్త‌వం క‌నిపించ‌లేద‌ని అంటున్నారు చాలా మంది. ప‌వ‌న్ బెట్టు దిగ‌క‌పోతే.. సింగిల్ గానే పోటీలో నిల‌వాల‌ని బీజేపీ భావిస్తోంద‌న్న అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు.. ఇదే విష‌యం తెగేదాకా రావ‌డంతో ఎందుకులే అని ప‌వ‌న్ వెన‌క్కు త‌గ్గార‌ని అంటున్నారు.

ఈ విధంగా.. తొలుత ఆవేశంతో స్పందించ‌డం.. ఆ త‌ర్వాత నీరుగారిపోవ‌డం ప‌వ‌న్ కు అలావాటుగా మారింద‌ని అంటున్నారు. దీనంత‌టికీ బీజేపీతో పొత్తే కార‌ణ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది జ‌న‌సైనికుల నుంచి. గ‌తంలో త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల‌పై స్పందించే ప‌వ‌న్‌.. ఇప్పుడు సైలెంట్ అయిపోయార‌ని, బీజేపీ చెప్పిన‌ట్టుగానే న‌డుచుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని వాపోతున్నారు కార్య‌క‌ర్త‌లు. ఏపీలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ చేస్తున్న రాజ‌కీయాల‌కు ప‌వ‌న్ బ‌లైపోతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, దీనిపై జ‌న‌సేనాని ఏమంటారో?