Begin typing your search above and press return to search.

అమిత్‌ షా పెద్ద త‌ల‌నొప్పిని త‌ప్పించుకున్నాడు

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:34 AM GMT
అమిత్‌ షా పెద్ద త‌ల‌నొప్పిని త‌ప్పించుకున్నాడు
X
జేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఎట్ట‌కేల‌కు కీల‌క తంతును ముగించారు. అతి సున్నిత‌మైన అంశానికి ఫుల్‌ స్టాప్ పెట్టారు. వచ్చే ఏడాది జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీహార్‌ లో సీట్ల పంపకాలపై ఎట్టకేలకు ఎన్డీయేలో సయోధ్య కుదిరింది. 40 లోక్‌ సభ స్థానాలున్న బీహార్‌ లో బీజేపీ - జేడీయూ చెరో 17 సీట్లలో పోటీ చేయనుండగా - మరో మిత్రపక్షం ఎల్‌ జేపీ 6 స్థానాల్లో పోటీకి దిగనుంది. అంతేగాకుండా ఎల్‌ జేపీకి ఉత్తర్‌ ప్రదేశ్ లేదా జార్ఖండ్‌ లో మరో సీటు కేటాయించడంతోపాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాం విలాస్ పాశ్వాన్‌ ను రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - బీహార్ సీఎం - జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ - ఎల్‌ జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ ఉమ్మడిగా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎవరెవరు ఏయే స్థానాల్లో పోటీ చేయబోయేది త్వరలోనే నిర్ణయించనున్నట్లు తెలిపారు.

2009 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకి వ్యతిరేక పవనాలు వీచినా - బీహార్‌ లో మాత్రం 40 స్థానాలకుగాను 32 స్థానాల్లో గెలుపొందిందని, ఈ సారి అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని నితీశ్‌ కుమార్ చెప్పారు.ఎన్డీయేలో ఎలాంటి సమస్యా లేదని - మోడీనే మళ్లీ ప్రధాని అవుతారని పాశ్వాన్ చెప్పారు. 2013లో ఎన్డీయే నుంచి వైదిలిగిన నితీశ్... 2017లో మళ్లీ ఆ కూటమిలో చేరారు. పాశ్వాన్‌ ను రాజ్యసభకు పంపే విషయంపై స్పందిస్తూ... దేశానికి ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగానే రాజ్యసభకు పంపుతున్నట్లు చెప్పారు.

ఇదిలాఉండ‌గా, బీహార్‌ లో పొత్తులు బీజేపీకి ప‌రువు స‌మ‌స్య‌గా మారాయి. ఎన్డీయే నుంచి ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్ ఎస్ ఎల్‌ పీ వైదొలిగిన నేపథ్యంలో సీట్ల విషయంపై గట్టిగా పట్టుబట్టిన పాశ్వాన్ ఆ మేరకు గణనీయంగానే దక్కించుకోగలిగారు. మరోవైపు నితీశ్‌ కుమార్ కూడా కమలం పార్టీకి తన అవసరం ఎంత ముఖ్యమో చెప్పగలిగారని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే పోటీ చేసి కేవలం రెండే స్థానాల్లో గెలుపొందగా - బీజేపీ భాగస్వామ్య పక్షంగా పోటీకి దిగిన ఎల్‌ జేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అయిన‌ప్ప‌టికీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన సీట్ల (22) కంటే ఈసారి ఐదు సీట్లు తక్కువగానే బీజేపీ పోటీకి సిద్ధపడడం గమనార్హం.