Begin typing your search above and press return to search.

కపిల్ దేవ్ - మాధురికి బీజేపీ గాలం..

By:  Tupaki Desk   |   27 Jun 2018 5:25 PM IST
కపిల్ దేవ్ - మాధురికి బీజేపీ గాలం..
X
బీజేపీ వచ్చే 2019 ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రంగాలపై దృష్టిసారించింది. బీజేపీకి సపోర్టుగా క్రీడాకారులను, సినీ ప్రముఖులను రంగంలోకి దించడానికి ఎత్తు వేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ను కలిశాడు. ఆయనను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా పంపేందుకు డిసైడ్ అయ్యాడు. ఇక ఈయనతో పాటు బాలీవుడ్ నాటి స్టార్ హీరోయిన్ మాధురి ధీక్షిత్ ను కూడా రాష్ట్రపతి కోటాలో మరో ఎంపీగా పంపేందుకు ఒప్పించారు.

ఇలా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశంలోని ప్రముఖులను ఆకర్షించేందుకు బీజేపీ చీఫ్ ప్లాన్ చేశారు. వీరి ద్వారా ప్రచారం చేయించుకొని లబ్ధి పొందేందుకు ప్లాన్ చేశారు. కానీ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఇదే ప్లాన్ వేసింది. కానీ 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిటైర్ అయిపోయిన సచిన్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ రేఖలను రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ చేసింది. వారు ఒక్కసారి కూడా సభకు రాకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. సచిన్ - రేఖలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ స్ట్రాటజీని అమలు చేస్తున్న అమిత్ షా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి లబ్ధి పొందుతాడోనన్నది వేచి చూడాల్సిందే..