Begin typing your search above and press return to search.

ఒడిశా ఎన్నికల ప్రచారంలో తెలుగు పాట పాడిన నేత!

By:  Tupaki Desk   |   21 April 2019 9:11 AM GMT
ఒడిశా ఎన్నికల ప్రచారంలో తెలుగు పాట పాడిన నేత!
X
ఒడిశా లోని పూరీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సంబిత్ పాత్ర ఎన్నికల ప్రచారంలో ఆసక్తిదాయకంగా వ్యవహరించారు. పూరీలో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఏకంగా తెలుగు పాటనే పాడాడు ఈ అభ్యర్థి. బీజేపీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ ట్రూప్ తో కలిసి పాత్ర పాటలు పాడి అలరించారు.

అందులో భాగంగా ఆయన ఒక తెలుగు పాటను పాడి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 'క్రిమినల్' సినిమాలో బాగా పాపులర్ అయిన 'తెలుసా.. మనసా..' పాటను సంబిత్ పాత్ర ఆలపించారు. ఆ సాంగ్ హిందీలో కూడా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఒకే ట్యూన్లో హిందీ - తెలుగు భాషల్లో పాపులర్ అయిన ఆ పాట తెలుగు వెర్షన్ ను సంబిత్ పాత్ర పాడారు. అక్కడి తెలుగు వారిని ఆ పాటతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారాయన. పూరీలోని పెంతకట ప్రాంతంలో తెలుగు వాళ్ల జనాభా గణనీయంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో అక్కడ వారిని ఆకట్టుకునేందుకు సంబిత్ పాత్ర ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలుగు వారిని ఆకట్టుకునేందుకు తెలుగు పాటనే పాడిన ఈ అభ్యర్థి అక్కడ విజయం సాధిస్తారేమో చూడాలి!