Begin typing your search above and press return to search.
టీ బీజేపీ... ఒక గూడ్సు రైలు
By: Tupaki Desk | 9 Aug 2015 7:40 AM GMTకేంద్రంలో ఫుల్ మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ర్టాల్లో పాగా వేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణలోని ఆ పార్టీ శాఖ అధికారం సాధించే స్థాయి కాదు కదా..కనీసం ఆ అంచనాలను కూడా అందుకోలేకపోతోంది. టీడీపీ బీజేపీ పొత్తు గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా గ్రేటర్‌లో గౌరవప్రదమైన స్థానాలే దక్కాయి. బీజేపీ ఐదు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక ఎంపీని గెలిపించుకుంది. కానీ మిగతా తెలంగాణ జిల్లాల్లో జెండా ఎగరేయలేకపోయింది.
తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవుతోందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసినా మిగతా పార్టీలు మద్దతివ్వడమో, సంఘీభావం తెలపడమో చూస్తుంటాం. కానీ బీజేపీ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుంది. ఏ పార్టీతోనూ కలవటంలేదు. ఎవరినీ కలుపుకుని పోవడంలేదు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో, ఇందిరాపార్క్ లో జరిగిన మున్సిపల్ మహాధర్నాలో టీడీపీ, వైసీపీ, సీపీఎం, లోక్ సత్తా పార్టీలన్నీ ఒకే గొడుగు కిందికొచ్చాయి. కానీ బీజేపీ మాత్రం వీరితో కలవలేదు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ధర్నాలోనూ బీజేపీ కనిపించలేదు.
సమస్యలపై పోరాడుతున్న ఇతర పార్టీలతో కలవడం మాత్రం కుదరదంటున్నారు బీజేపీ నేతలు. సైద్ధాంతిక విభేదాలున్న వామపక్షాలతో ఎలా కలిసి పనిచేస్తామనేది కాషాయ నేతల వాదన. బీజేపీ ఎవరితో కలవకపోవడానికి మరో కారణం కూడా ఉందని చెప్తుననారు. ఎవరో నిర్వహించే ధర్నాలో పాల్గొంటే... ఆ కార్యక్రమం సక్సెస్ అయితే క్రెడిట్ వారికి వెళ్తుంది తప్ప తమకు రాదనే ఆలోచనలో ఉన్నారట బీజేపీ నేతలు. ఒకవేళ తాము చేసే ధర్నాకు వేరే పార్టీ నేతల్ని పిలిచినా...ఆ క్రెడిట్ వాళ్లకు పోతుందేమో అన్న భయం కూడా ఉందట. ఏదైనా చేస్తే మేమే చేస్తాం... మమ్మల్ని ఎవరూ శాసించాల్సిన, ఆదేశించాల్సిన అవసరం లేదని టీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
ఇలా సోలో షో నడిపిస్తూ ఎంతకాలం ముందుకువెళతారో కమలనాథులు. త్వరలోనే ఉన్న గ్రేటర్ ఎన్నికలను ఏ విధంగా ఎదర్కుంటారో చూడాలి మరి.