Begin typing your search above and press return to search.
ఆపరేషన్ కమల్.. సిక్కింలో పదిమంది ఎమ్మెల్యేలు జంప్
By: Tupaki Desk | 13 Aug 2019 1:55 PM GMTదేశంలో తమ సిద్ధాంతాన్ని ఏక్ దేశ్.. ఏక్ విశ్వాస్ స్తాపించేందుకు, అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. దేశం మొత్తాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ కమల నాథులు పెద్ద ఎత్తున తమకు అనకూలంగా రాజకీయం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గోవాలో అదికారం చేజిక్కించుకున్న కమల నాథులు.. ఆ వెంటనే దక్షిణాదిన ప్రజలు తమను తిరస్కరించినా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఏదో విధంగా పొగబెట్టి.. అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
ఇంతలోనే కశ్మీర్‌పై కన్నేశారు. అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసి.. దేశంలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంచి.. సంచలనాని కి తెరదీశారు. ఈ విషయంపై చర్చ నడుస్తున్న క్రమంలోనే కమల నాథులు మరికొన్ని ఎత్తుగడలకు తెరదీశారు. ఈ క్రమం లోనే ఈశాన్య రాష్ట్రమైన సిక్కింపైనా ఆపరేషన్ లోటస్‌ను ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో రాజకీయ కుదుపు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే కమలం వికసిస్తుండగా తాజాగా సిక్కిం రాష్ట్రంలో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు ఫిరాయించారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్‌మాధవ్‌ల సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌లో కేవ లం 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. దీంతో సిక్కిం అసెంబ్లీలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కినట్లయ్యింది. వాస్తవానికి బీజేపీ ఒక్క సీటు కూడా సిక్కింలో గెలవలేదు. సిక్కిం క్రాంతికారీ మోర్చా పార్టీ 17 సీట్లు గెలువగా... ఎస్ డీఎఫ్ 15 స్థానాలు గెలుచుకుంది.
ప్రస్తుతం సిక్కిం క్రాంతి కారీ మోర్చా ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే, 2018లోనే నిర్ణయించుకున్న సిక్కింలోనూ అధికారంలోకి వచ్చితీరుతామని ప్రకటించిన కమల నాథులు ఇప్పుడు అదేదిశలో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను ఫిరాయించేలా చేసుకుని.. రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకోవడంపై ప్రజాస్వామ్య వాదులు మండి పడుతున్నారు. వీరు ఇతరులకు నీతులు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలకు బీజేపీ దూరంగా ఉండాలని కోరుతున్న వారు కూడా ఉన్నారు. మరి కమల నాథుల వ్యూహాల ముందు ఈ మాటలు వినిపిస్తాయా?