Begin typing your search above and press return to search.
గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. కేజ్రీవాల్‌కు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఇదే!
By: Tupaki Desk | 5 Nov 2022 11:30 PM GMTగుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగాలని బీజేపీ తనను కోరిందని చెప్పారు. ఈ మేరకు ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ తప్పుకుంటే సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తమ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ బాంబు పేల్చారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని ఆఫర్ చేసిందన్నారు.
ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించటం వల్ల తాను ఆందోళన చెందుతున్నట్లు కనిపించటం లేదని బీజేపీ భావిస్తుందన్నారు. బీజేపీని ఓటమి భయం వెంటాడుతుందని చెప్పారు. ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లోనూ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే బీజేపీ ఇలా భయపడదని తెలిపారు.
"నిజానికి గుజరాత్‌తో పాటు ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడపోతామని బీజేపీ భయపడుతోంది. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు. ఆప్‌ను వీడితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు" అని అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు.
'గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్, సిసోడియాలపై ఉన్న అన్ని కేసులను తొలగిస్తామని ఆఫర్ చేశారు.' అని కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఎవరు ఆఫర్ చేసారనే ప్రశ్నకు.. బీజేపీ నేరుగా ఎప్పుడూ సంప్రదించదని చెప్పారు. సొంత పార్టీ నేతల ద్వారానే తనకు ఈ ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు.
కాగా ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారం దక్కించుకున్న కేజ్రీవాల్ గుజరాత్‌లోనూ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో సైతం అధికారాన్ని దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.