Begin typing your search above and press return to search.
బీజేపీ పరువు తీసే మాట చెప్పిన ఐరన్ లేడీ
By: Tupaki Desk | 13 Feb 2017 4:19 PM GMTఐదు రాష్ట్రాలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకు తగ్గట్లే భారీ కసరత్తునే చేస్తున్నారు కమలనాథులు. ఇదిలా ఉంటే.. మణిపూర్ ఉద్యమకారిణి.. ఐరెన్ ఉమెన్ గా పేరున్న ఇరోం షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఇమేజ్ మొత్తంగా డ్యామేజ్ అయ్యేలా ఆమె సరికొత్త ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు రూ.36 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. తానుదీక్ష విరమించినతర్వాత బీజేపీ నేత ఒకరు తనను కలిశారని.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా చెప్పటమే కాదు.. రూ.36 కోట్ల మొత్తాన్ని ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా చెప్పారు.
ఈ మొత్తాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు అందిస్తుందని సదరు నేత చెప్పినట్లుగా ఆమె వెల్లడించింది. అంతేకాదు.. తాను పోటీ చేస్తానంటే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ పై పోటీ చేసేందుకు తమ పార్టీ సీటు ఇస్తుందని కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఇరోం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని.. ఒకవేళ విఫలమైతే.. న్యాయపరమైన చిక్కులు ఎదురు కావటం ఖాయమన్న మాటను మణిపూర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ స్పష్టం చేశారు. మరి.. తాను చేసిన ఆరోపణలపై ఇరోం ఎలా రియాక్ట్ అవుతారో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/