Begin typing your search above and press return to search.
బీజేపీ నుంచి బుద్ధా వెంకన్నకు మంత్రి పదవి ఆఫర్...
By: Tupaki Desk | 26 July 2019 1:30 PM GMTఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తాజా అసెంబ్లీ సమావేశాలు అధికార వైసిపి... విపక్ష టిడిపి మధ్య కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించేలా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బీజేపీ పాత్ర నామమాత్రంగానే ఉంది. బిజెపికి శాసనసభలో ఒక సభ్యుడు కూడా లేడు. ఇక మండలిలో మాత్రమే ఆ పార్టీ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీ లాబీలో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బిజెపి నేత సోము వీర్రాజు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే మీ పార్టీ వాళ్లంతా మా పార్టీలో చేరుతున్నారు... మీరు ఇప్పుడు టిడిపిలో ఉండి ఏం ? సాధిస్తారు... బిజెపిలో చేరాలని వీర్రాజు ఆహ్వానించారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మంత్రి పదవి ఇస్తామని మా పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని కూడా స్పష్టం చేశారు. వీర్రాజు తనకు ఇచ్చిన ఆఫర్ తిరస్కరించిన వెంకన్న ఆయనకు రివర్స్ ఆఫర్ ఇచ్చారు. మీరే మాతో కలిసి పనిచేయండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేబినెట్ లోకి తీసుకుంటాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అటు బుద్ధా వెంకన్న టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందితే... ఇటు సోము వీర్రాజు బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. కొంతకాలంగా వీర్రాజుకు పార్టీలో సరైన ప్రయార్టీ లేకపోవడంతో ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఇటు బుద్ధా వెంకన్నకు, ఆ పార్టీకే చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య కొద్ది రోజులుగా జరుగుతోన్న ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. ఈ వార్ నుంచి పార్టీ ఆదేశాల మేరకు వెంకన్న డ్రాప్ అయినా నాని మాత్రం తన యుద్ధాన్ని సొంత పార్టీతో పాటు వైసీపీ నేతలపై కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.