Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి రాజగోపాల్ కు బీజేపీ బడా ఆఫర్
By: Tupaki Desk | 17 Jun 2019 8:11 AM GMTకాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి.. ఈ రోజు దిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు బీజేపీ పెట్టిన ప్రతిపాదన విని తెలంగాణలోని మిగతా నేతలూ ఆశ్చర్యపోతున్నారట. తామూ బీజేపీలోకి వెళ్తే తమకూ మంచి పదవులు దక్కే ఛాన్సుందని ఆశపడుతున్నారట. ఇంతకీ.. బీజేపీ రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ చేసిన పదవేంటో తెలుసా.. రాజ్యసభ. ప్రస్తుతం రాజగోపాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు రావాలని బీజేపీ పెద్దలు సూచించారట.
2024 ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ - అందుకు వేస్తున్న వ్యూహాల్లో భాగంగా - ఇక్కడి నుంచి ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. ఆ క్రమంలోనే.. కోమటిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనుకుంటోందట. తెలంగాణ నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే - ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి - తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం - ఈ మేరకు కోమటిరెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
రాజగోపాల్ ఖాళీ చేసే స్థానంలో బీజేపీ అభ్యర్థిని నిలిపితే రాజగోపాల్ ఆయన్ను గెలిపించగలరన్నది బీజేపీ యోచనగా తెలుస్తోంది. ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే అది తెలంగాణలో ఆ పార్టీకి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టడం ఖాయం. అదేసమయంలో రాజగోపాల్ కు రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా తెలంగాణలోని కాంగ్రెస్ - ఇతర పార్టీల నాయకులకు ఆశలు కల్పించి బీజేపీలో చేరే విధంగా పురిగొల్పొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ నేతలే కాకుండా టీఆరెస్ నుంచి కూడా అసంతృప్త నేతలను బీజేపీలోకి తీసుకునే దిశగా బీజేపీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడం దానికి తొలిమెట్టుగా చెబుతున్నారు.