Begin typing your search above and press return to search.
బీజేపీ ఆఫీస్ ముట్టడికి రెడీ ?
By: Tupaki Desk | 23 Jan 2022 1:45 PM GMTఏపీలో బీజేపీ ఈ మధ్యనే పోరాటాలు గట్టిగా చేస్తోంది. మా దూకుడు చూపిస్తామని కూడా జగన్ ప్రభుత్వానికి చెబుతోంది. అదంతా రాజకీయ పోరాటం అయితే దానికి ధీటుగా వైసీపీ నుంచి కూడా ఘాటైన రిప్లై వస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ మీదకు విశాఖ ఉక్కు కార్మికులు గురి పెట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత పదకొండు నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది.
ఈ నేపధ్యంలో ఉక్కు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ బీజేపీ మీద మండిపడుతోంది. బంగారం లాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం దారుణమని కూడా అంటోంది. ఇక విశాఖ ఉక్కు కేవలం విశాఖకే పరిమితం కాదని, ఇది ఉత్తరాంధ్రా ఆర్ధిక వనరుగా ఉందని కూడా పేర్కొంది. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఫిబ్రవరి 23న విశాఖ బంద్ తో పాటు రాష్ట్ర బంద్ ని కూడా నిర్వహించనున్నట్లుగా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
అదే విధంగా విశాఖలోని బీజేపీ ఆఫీస్ ని ఈ నెల 13న ముట్టడిస్తామని ప్రకటించారు. ఉక్కు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీకి తమ సత్తా ఏంటో చూపిస్తామని కమిటీ చైర్మన్ సీ హెచ్ నరసింగ రావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఏడు వందల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిందని అన్నారు. మరో వైపు కరోనా వల్ల 150 మంది కార్మికులు మృతి చెందారని, వారంతా కూడా అంకిత భావంతో పనిచేస్తూ ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు.
ఇక వచ్చే నెల 12న విశాఖ ఉక్కు పోరాటానికి ఏడాది పూర్తి అవుతుందని, ఇక మీద మరింత దూకుడుగా పోరాటం చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. మరో వైపు ఫిబ్రవరి నెల మొదటి వారంలో కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖ స్టీల్ ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున చేస్తున్న పోరాటం ఒక స్పూర్తి అని ఆయన అన్నారు. దాన్ని ప్రపంచానికి తెలియచేస్తామని స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు తేలిగ్గా రాలేదని, లైట్ గా తీసుకుని ప్రైవేట్ చేస్తే చూస్తూ ఊరుకోమని మరో నేత రాజశేఖర్ హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కు వెనక 16 వేలకు పైగా కుటుంబాల త్యాగం ఉందని ఆయన గుర్తు చేశారు. దీపం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్పేయాలని చూస్తే బీజేపీ దీపమే ఆరిపోతుందని కూడా హెచ్చరించారు. కేవలం అయిదు వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే కేంద్రం పెడితే విశాఖ ఉక్కుని చమటను చిందించడం ద్వారా కార్మికులు మూడు లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయబోమని గర్జించారు. మొత్తానికి విశాఖ ఉక్కు సెగ మరింత గట్టిగానే ఈసారి బీజేపీకి తగలనుంది అంటున్నారు.