Begin typing your search above and press return to search.

రాజ‌ధాని పై టీడీపీకి ఝ‌ల‌కిచ్చిన బీజేపీ!

By:  Tupaki Desk   |   17 Jan 2020 5:22 PM GMT
రాజ‌ధాని పై టీడీపీకి ఝ‌ల‌కిచ్చిన బీజేపీ!
X
జ‌గ‌న్ మీద భార‌తీయ జ‌న‌తా పార్టీకి కంప్లైంట్లు చేయాలి అనేది చంద్ర‌బాబు నాయుడు వ్యూహం. అయితే ఆయ‌న‌ను ఇప్పుడు బీజేపీ పెద్ద‌లు ప‌ట్టించుకునేలా లేరు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు నాయుడు ఆడిన ఆట‌ల‌న్నింటినీ క‌మ‌లం పార్టీ పెద్ద‌లు గుర్తుంచుకున్న‌ట్టుగా ఉన్నారు. ఈయ‌న‌ను ఢిల్లీ ద‌రిదాపుల్లోకి కూడా వారు రానివ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌ను ఇప్పుడే అక్క‌డకు వెళితే న‌వ్వుల‌పాలు కావ‌డం ఖాయ‌మ‌ని తెలిసి చంద్ర‌బాబు నాయుడు త‌న త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వాడుతున్న‌ట్టుగా ఉన్నాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఎన్నిక‌ల ముందు భార‌తీయ జ‌న‌తా పార్టీ ని గ‌ట్టిగానే విమ‌ర్శించారు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిస్సిగ్గుగా వెళ్లి బీజేపీ వాళ్ల‌ను క‌లిశాడు. ఆ పార్టీతో క‌లిసి ప‌ని చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించేశారు. అయితే ఢిల్లీ వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని అంశం గురించి మాట్లాడ‌టం ఆపేశాడు. అంతుకు ముందు ధూంధాం అన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు.. మాత్రం ఆ అంశం మీద దూకుడుగా మాట్లాడ‌టం లేదు.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా రాజ‌ధాని విష‌యంలో మొద‌టి నుంచి చంద్ర‌బాబు అజెండాకు అనుగుణంగా స్పందించ‌డం లేదు. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సుజ‌నా చౌద‌రిల‌ను మిన‌హాయిస్తే.. బీజేపీ వాళ్లు ఎవ‌రూ ఆ అంశం గురించి చంద్ర‌బాబు అజెండాకు అనుకూలంగా స్పందించ‌లేదు. వీరిలో సుజ‌నా చౌద‌రికి రాజ‌ధాని ఏరియాలో భూములున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మాట్లాడుతున్నారు కానీ.. త‌మ పార్టీ అధిష్టానం స్పందిస్తుంద‌ని కానీ, కేంద్రం చ‌క్రం అడ్డేస్తుంద‌ని కానీ గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతూ ఉన్నారు.

ఈ ప‌రిణామాల్లో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ఆ మ‌ధ్య‌న స్పందించారు. రాజ‌ధాని రాష్ట్రం ప‌రిధిలోని అంశ‌మ‌న్న‌ట్టుగా ఆయ‌న తేల్చి చెప్పారు. ఆ విష‌యంలో త‌మ పార్టీ నేత‌లు ఒక మాట మీద మాట్లాడాల‌న్న‌ట్టుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. అలా బీజేపీ లో రాజ‌ధాని ఔత్సాహికుల ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లారు.

రాజ‌ధాని డ్రామాలోకి బీజేపీని లాగాల‌ని చంద్ర‌బాబు నాయుడు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించారు. మోడీ మాస్కులు వేసి ధ‌ర్నాలు కూడా జ‌రిగాయి. అయితే ఈ డ్రామాల‌కు ఢిల్లీ నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మ‌ధ్య‌లో గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి మ‌రింత హైడ్రామా చేయాల‌ని చూశారు. ఇన్ని డ్రామాల‌కు కూడా తెలుగుదేశం అజెండాకు అనుగుణంగా బీజేపీ స్పందించ‌డం మాత్రం జ‌ర‌గ‌డం లేద‌నేది గమ‌నార్హం.