Begin typing your search above and press return to search.

జమిలి.....బిజేపీ కిరికిరి

By:  Tupaki Desk   |   16 Aug 2018 6:17 AM GMT
జమిలి.....బిజేపీ కిరికిరి
X
దేశంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కేంద్రం మాత్రం జమిలి ఎన్నికలపై పట్టుదలగా ఉంది. లోక్‌ సభకు - దేశంలో అన్నీ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని క్రుత నిశ్చయంతో ఉంది. జమిలి విధానంపై చాలా రాష్ట్రాలు తమ వ్యతీరేకత వ్యక్తం చేసిన బిజేపీ మాత్రం జమిలి ఎన్నికల వైపే మొగ్గు చూపుతోంది. వచ్చే సంవత్సరం జరగనున్న సార్వత్రిక ఎన్నికలను జమిలిగానే నిర్వహించాలనుకున్న - అది ఈ సారి సాధ్యం కాకపోవచ్చు. 2024 లో జరిగే ఎన్నికలను మాత్రం జమిలిగానే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై ఓ చట్టాన్ని తీసుకుని రావలనుకుంటోంది. పార్లమేంటులో చట్టం చేస్తే ఇక ఎవ్వరూ వ్యతీరేకించే అవకాశం ఉండదు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - బిజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ జమిలి ఎన్నికలపై పట్టుదలగా ఉన్నారు. దేశంలో ఎన్నికల వ్యయం ఎక్కువవుతోందని, అలాగే నిర్వాహన కూడా కష్టసాధ్యమవుతోందని సాకుగా చూపిస్తున్నారు. జమిలి ఎన్నికలైతే ఖర్చు తగ్గుతుందని వారి వాదన. దీని వెనుక జమిలి ఎన్నికలతో లాభ పడవచ్చన్నది బిజేపీ అంతరంగ వ్యూహం. ఓటారు ఓకేసారి రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఒకటి ప్రాంతీయ పార్టీకి - మరొకటి జాతీయ పార్టీకి వేసే అవకాశం ఉందని - తద్వారా తాము లాభపడవచ్చునని బిజేపి నాయకుల ఉద్దేశ్యం. కాని జమిలి విధానాన్ని చంద్రబాబు నాయుడు - దేవే గౌడ - మమతా బేనర్జీ వంటి సీనియర్ రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను అణచివేసేందుకే ఈ జమిలి ఎన్నికలని వారి అభిప్రాయం. వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ చట్టం ద్వారా తన పని తాను చేయాలనుకుంటోంది. జమిలి ఎన్నికలపై చట్టాన్ని రూపొందించే పనిలో లా కమిషన్ ఉంది. ఈ నెలాఖరు నాటికి లా కమిషన్ సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఈలోగా చట్టాన్ని రూపోందించే పనిలో సభ్యులు ఉన్నారు. ఈ నెలాఖరులోపు చట్టాన్ని రూపొందించి వచ్చే లోక్‌ సభ సమావేశాలలో చట్టబద్రత కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది. 2019 ఎన్నికలలో లోక్‌ సభతో పాటు 11రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సారి ఇలా చేసినా 2014లో మాత్రం జమిలి ఎన్నికలకే వెళ్లాలని బిజేపీ నాయకుల వ్యూహం. ఆ దిశాగా ప్రధాని మోదీ - అమిత్ షా పావులు కదుపుతున్నారు.