Begin typing your search above and press return to search.
అన్నాడీఎంకే ఫైటింగ్లోకి బీజేపీ... చక్రం తిప్పుతున్న కమల నాథులు..!
By: Tupaki Desk | 13 July 2022 12:30 AM GMTదక్షిణా రాష్ట్రాల్లో పాగా వేయాలని గట్టి పట్టుతో ఉన్న బీజేపీ.. ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా చక్రం తిప్పు తోంది. తెలంగాణనుతీసుకుంటే.. అక్కడ పోరు బాట పట్టింది. సీఎం కేసీఆర్‌పై సై.. అంటేసై అంటూ.. దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో వైసీపీతో చెలిమి చేస్తున్నట్టు నటిస్తూ... ఎన్నికల సమయానికి ఎలాంటి వాతావరణం ఉంటే.. అలా.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడుతమిళనాడుపై పడింది. ఇక్కడ వాస్తవానికి బీజేపీకి అంత సీన్ లేదు. కానీ, ఇది జయలలిత జీవించి ఉన్నప్పుడు. కానీ, ఇప్పుడు పపరిస్థితి మారిపోయింది. జయ పార్టీ అన్నాడీఎంకేను టార్గెట్ చేసు కుని.. బీజేపీ నేతలు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారనే వాదన ఉంది.
జయ మరణం తర్వాత..అన్నా డీఎంకేకు అధినేత ఎవరు.? అనే ప్రశ్న వచ్చింది. ఈ క్రమంలోనే జయ తరచుగా.. ఆపద్ధర్మ ముఖ్యమం త్రిని చేసిన.. పన్నీర్ సెల్వం.. పార్టీ ప్రధాన కార్యదర్శి.గా అప్పట్లో చక్రం తిప్పిన.. పళని స్వామిలు పోటీ పడ్డా రు.
అధికారంలో ఉన్నప్పుడే.. వీరి మద్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న బీజేపీ.. ఇద్దరి నీ తనవైపు తిప్పుకొని.. అప్పటికే పార్టీలో పెద్దన్నగా వ్యవహరించాలని భావించిన శశికళను జైలుకు పం పించిందనే టాక్ ఉంది. అయితే.. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయింది. దీంతో మరోసారి.. అన్నాడీఎంకేలో చిచ్చు రేగింది.
అయితే.. దీనివెనుక బీజేపీ ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో అన్నాడీఎంకేలో పనిచేసిన నాయకుడు అన్నామలైని రాష్ట్ర పార్టీ చీఫ్ ను చేయడం ద్వారా..అన్నాడీఎంకే వర్గాన్ని చీల్చి తాను బలపడాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు చెబుతున్నారు.
దీనిలో భాగంగానే.. అన్నాడీఎంకేలో వచ్చిన చీలిక..తదనంతర పరిణామాలతో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక కావడం.. ఆ ఫీస్‌ను పన్నీర్ చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేయడం.. అయితే.. ఇది బెడిసికొట్టడం వంటి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ.. అదును చూసుకుని.. అన్నాడీఎంకే నేతలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది.