Begin typing your search above and press return to search.
మూడు చేంజ్ : జగన్ కి బీజేపీ మార్క్ షాక్...?
By: Tupaki Desk | 14 Sep 2022 12:30 AM GMTఏపీలో రాజధాని మీద రాజకీయ రచ్చ ఒక లెవెల్ లో సాగుతోంది. అమరావతి ఏకైక రాజధాని అని హై కోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది. అదే టైం లో మూడు రాజధానులు అంటూ వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ఇంకో వైపు అమరావతి రైతులు వేయి కిలోమీటర్ల మహా పాదయాత్రను తాజాగా ప్రారంభించారు. అమరావతి టూ అరసవెల్లి అంటూ రైతులు చేస్తున్న ఈ పాదయాత్ర మొదలైన వెంటనే కేంద్రం చాలా వేగంగా ఈ అంశం మీద రియాక్ట్ అయింది.
ఏపీలో కొత్త రాజధానికి సంబంధించి నిధుల సహకారం కేంద్రం ఇవ్వాలి. విభజన చట్టంలో పక్కాగా అది ఉంది. దాంతో ఏపీలో ఒకే ఒక రాజధానికి కేంద్రం సాయం చేస్తుందని లేటెస్ట్ గా స్పష్టం చేసింది. అంటే దీని అర్ధం ఏపీలో మూడు రాజధానులు అంటూ ముందుకు పోతున్న జగన్ సర్కార్ కి షాకిచ్చేలాగానే కేంద్రం నిర్ణయం తీసుకుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
అదే టైం లో కేంద్ర నిధులు సాయం లేకుండా వైసీపీ ఎలా మూడు రాజధానులు నిర్మించగలదు అన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు అమరావతి రాజధానికే తమ మద్దతు అని ప్రకటించి ఉద్యమంలో భాగం అవుతున్నారు. కేంద్రం అయితే ఇంకా ఏమీ తేల్చలేదని అంతా అనుకుంటున్నారు. అయితే ఆ మధ్యన ఈ విషయం హై కోర్టులో విచారణకు వచ్చినపుడు రాజధాని అన్నది రాష్ట్రం ఇష్టమని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు కేంద్రం మద్దతుగా ఉందని వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. ఇక ఆ మధ్యన తిరుపతి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే రైతుల రాజధాని ఉద్యమంలో భాగస్వాములు కావాలని తమ పార్టీ వారిని కోరారు. ఆ తరువాత ఏపీ బీజేపీ స్టాండ్ మారింది. ఇపుడు చూడబోతే కేంద్రం స్టాండ్ కూడా మారిందా అన్న చర్చ అయితే వస్తోంది.
ఒకే ఒక్క రాజధానికే కేంద్రం నిధులు ఇస్తుందని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా కేంద్రం కుండబద్ధలు కొట్టిందని అంటున్నారు. ఇక విభజన హామీలు కీలక అంశాల మీద ఈ నెల 27న కేంద్ర హోం శాఖ ఆద్వర్యంలో ఢిల్లీలో అధికారుల స్థాయిలో భేటీ జరగబోతోంది. ఈ భేటీలో ఏపీ రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమరావతికి కేంద్రం మద్దతు ఉందని తెలిస్తే కనుక వైసీపీ వైఖరిలో మార్పు వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.
ఇంకో వైపు చూస్తే విభజన చట్టం ప్రకారం ఒక రాజధానికి మాత్రమే కేంద్రం నిధులు ఇవ్వడం అన్నది సాధారణమైన విషయం అని అంటున్న వారూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాలు దేశంలో కొన్ని తమకు అనుకూలంగా రెండవ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాయి. వాటి నిధులు ఖర్చు అంతా అవే భరిస్తున్నాయి. ఆ విధంగా తాము మాత్రం ఒకే రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది అంటున్నారు. అయితే ఆ రాజధాని అమరావతి మాత్రమే అని కేంద్రం నిక్కచ్చిగా చెబితే మాత్రం విశాఖ రాజధాని కోసం అయ్యే పదివేల కోట్ల రూపాయల ఖర్చుని వైసీపీ సర్కార్ భరిస్తుందా అన్న ప్రశ్న కూడా వస్తోంది.
అలాగే హై కోర్టుని కర్నూల్ తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టు కలసి సంప్రదించుకుని తమకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆ మధ్య పార్లమెంట్ లో చెప్పారు. పైగా ఆ ఖర్చులు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. అంటే కేంద్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ఖర్చు భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద పెడితే అపుడు మూడుకు ముకు తాడు పడుతుంది అని ఆలోచన ఏమైనా చేస్తోందా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి ఒకే రాజధానికి నిధులు అని కేంద్రం చెప్పడం అంటే కచ్చితంగా అది వైసీపీకి గట్టి షాకే అని అంతా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.