Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ బలహీనతలేంటి? కేసీఆర్‌ పై బీజేపీ హైఅలెర్ట్

By:  Tupaki Desk   |   10 Jan 2023 12:30 AM GMT
బీఆర్ఎస్ బలహీనతలేంటి? కేసీఆర్‌ పై బీజేపీ హైఅలెర్ట్
X
తెలంగాణలో కేసీఆర్ ను ఎదుర్కోవడం బీజేపీకి కానకష్టం అవుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించడాన్ని బీజేపీ ఇజ్జత్ కా సవాల్ గా తీసుకుంది. కేంద్రాన్నే ధిక్కరిస్తున్న కేసీఆర్ ను ఓడించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కేసీఆర్ కు చెక్ పెట్టడానికి ఉన్న వనరులు అన్నింటిని వాడుకోవాలని చూస్తోంది.

ప్రధానంగా తెలంగాణలో ప్లస్ లు, మైనస్ లు ఏమున్నాయని బీజేపీ అధిష్టానం తాజాగా సర్వేలు, నివేదికలతో హోరెత్తిస్తోందట.. ప్రజల మూడ్ ను కూడా వీళ్లు తెలుసుకుంటున్నారు. బీజేపీని గెలిపించడానికి.. కేసీఆర్ ను ఓడించడానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది బీజేపీ అధిష్టానం ఆరాతీస్తోంది.

ఇక బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వివరాల సేకరణపై రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నేతల బలహీనతలు తెలుసుకొని వారిని లాగాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కమళదళానికి బిగ్ టాస్క్ ఇచ్చినట్టు సమాచారం. వివిధ అంశాలపై బీజేపీ నేతలందరూ సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ బలాలు బలహీనతలు తెలుసుకోవాలని సూచించింది. అధికార పార్టీపై వ్యతిరేకత ఎంత ఉందన్న దానిపై ఆరాతీస్తున్నారు. కామారెడ్డి ఎపిసోడ్ సహా బీఆర్ఎస్ వైఫల్యాలపై పరిశోధిస్తున్నారు.

ఇక బీజేపీ బలాలు బలహీనతలు జాయినింగ్స్, బూత్ స్థాయి కమిటీల నియామకం వంటి అంశాల పైనా నివేదికలు కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా నియోజకవర్గ స్తాయి నేతలను తయారు చేయాలని ఇతర పార్టీ లనుంచి లాగాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో చర్చించి తెలంగాణలో పట్టు సాధించాలని చూస్తోంది.

సంక్రాంతి తర్వాత తెలంగాణలో చతుర్ముఖ వ్యూహంతో వెళ్లడానికి బీజేపీ రెడీ అయ్యింది. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మూడు నెలలకు సంబంధించి విధివిధానాలను కూడా ఖరారు చేసుకుంది. ఈ మేరకు బీజేపీ నేతలకు హైకమాండ్ దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.