Begin typing your search above and press return to search.
భయపెట్టు-బెదిరించు.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అస్త్రం?!
By: Tupaki Desk | 18 Nov 2022 2:30 AM GMTగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోమరోసారి గెలుపు గుర్రం ఎక్కి.. తన ప్రభంజనాన్ని నిలుపుకోవాలని తహతహ లాడుతున్న బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించు-భయపెట్టు.. అనే సూత్రాన్ని పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 14 రోజులపైగానే సమయం ఉండగా.. ఇప్పుడే బీజేపీ పార్టీ.. ప్రత్యర్థులను బెదిరించి.. మరీ.. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీకి కంట్లో నలుసుగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆప్ తన అబ్యర్థులను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి బెదిరింపుల కారణంగానే బుధవారం ఆప్ అభ్యర్థి ఒకరు నామినేషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఆప్ జాగ్రత్త పడుతోంది.
సూరత్ ఈస్ట్ అభ్యర్థి కంచన్ జరీవాలా తన నామినేషన్ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేప్టటింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్లు విత్డ్రా చేసుకోకూడదని అభ్యర్థులకు సూచించింది. సూరత్కు చెందిన పార్టీ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించింది. నగరానికి అవతల ఓ ప్రాంతానికి వీరిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక, నామినేషన్ను ఉపసంహరించుకున్న కంచన్ జరీవాలా.. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు లేఖ రాశారు. తన ప్రాణానికి హాని ఉందని, కాంగ్రెస్ అభ్యర్థి అస్లాం సైకిల్వాలా మనుషులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ సూరత్ పోలీస్ కమిషనర్ను అభ్యర్థించారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యక్షమైన జరీవాలా.. తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆయన్ను బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆప్ ఆరోపణలు చేసింది. బీజేపీ ఒత్తిడి వల్లే ఆయన.. నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఆప్ ఆరోపించగా.. బీజేపీ నాయకులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.