Begin typing your search above and press return to search.
బీజేపీ రిటర్న్ గిఫ్ట్ వెరీ హాట్ గురూ...ఏం చేద్దాం సారూ....?
By: Tupaki Desk | 23 Nov 2022 2:30 AM GMTబీజేపీ అదను చూసి వ్యూహానికి పదును పెట్టింది. ఈ మధ్య కాలంలో తమకు ఎదురు నిలిచి అదే పనిగా దండెత్తుతున్న టీయారెస్ మీద ఏకంగా దాడి మొదలెట్టేసింది. కేసీయార్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మీద ఐటీ దాడులు చేశారు. ఏకంగా యాభై బృందాలు ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ దాడులు ఎలా సాగాయి అంటే మల్లారెడ్డి కొడుకు కూతురు, అల్లుడు, బంధువులు ఆయన వైద్య కాలేజెస్ కి చెందిన చోట్ల, నివాసాలు, కలాశాల డైరెక్టర్లు ఇలా మొత్తానికి మొత్తం వదలకుండా ఈ దాడులు చేశారు.
బంధ్వుల ఇంట్లో రెండు కోట్ల మొత్తం పట్టుకున్నారు. మరో వైపు చూస్తే మల్లారెడ్డి వైద్య కళాశాలలో సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకున్నారు అన్న దాని మీద కూడా నిఘా పెట్టిన ఐటీ అధికారులు కళాశాలల లావాదేవీల లెక్కలలో తేడాలను గుర్తించారని అంటున్నారు. మొత్తానికి మల్లారెడ్డి మీద ఐటీ దాడులు స్టార్ట్ కావడంతో ఆట మొదలైంది అంటున్నారు.
మొయిదాబాద్ ఫాం హౌస్ ఆపరేషన్ విషయంలో టీయారెస్ బీజేపీని కెలికింది. ఇప్పటికీ ఇబ్బంది పెడుతోంది. బీజేపీలో కేవలం కేలక నేతగా ఉంటూ అధికార రాజకీయాలకు దూరంగా ఉండే బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ పరిణామాలతో బీజేపీకి మండుకొచ్చింది అని అంటున్నారు.
ఇక దూకుడు చేయాల్సిందే అన్న తీరున బీజేపీ రాజకీయ వ్యూహం రచించిందని దాని ఫలితమే మల్లారెడ్డి ఇంటి మీద ఐటీ దాడులు అంటున్నారు. ఆయన ఒక్కరే కాదుట చాలా మంది టీయారెస్ కీలక నేతల మీద ఐటీ ఈడీ దాడులకు రంగం సిద్ధం అయింది అని అంటున్నారు. కేసీయార్ ని టీయారెస్ ని వదలకూడదని బీజేపీ డిసైడ్ అయింది అని అంటున్నారు.
ఇప్పటికి నాలుగు సార్లు మోడీ హైదారాబాద్ వస్తే కేసీయార్ ఒక రేంజిలో గర్జన స్వరం వినిపించారు. దాంతో ఆయన వైఖరి మీద గుర్రుగా ఉన్న బీజేపీ ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటోంది అంటున్నారు. మోడీ ఈడీ బోడీ అని ప్రాసలతో కూడిన పదాలు వల్లించడం కాదు మాటర్ లోకి దిగితే కధ ఇలాగే ఉంటుంది అని చెప్పడమే కమలం పెద్దల ఉద్దేశ్యమని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం మీద వరసబెట్టి దూకుడు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఒక స్కాం లో చిక్కుకున్న విద్యా మంత్రి మీద ఈడీ ఐటీ దాడులు చేశారు. ఆయన అవినీతిని బయటేసి జైలు పాలు చేయించారు. అంతే ఆ తరువాత అక్కడ మమత ఫుల్ సైలెంట్ అయ్యారు అంటున్నారు.
ఇపుడిపుడే గొంతు పెంచి కేంద్రం మీద దండయాత్ర చేస్తున్న కేసీయార్ విషయంలో కూడా బెంగాల్ ఫార్ములానే అమలు చేయడానికి బీజేపీ రెడీ అంటోంది. దాంతో అమీ తుమీకి కూడా సిద్ధపడుతోంది. లిస్ట్ చాలానే ఉంది అని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ రిటర్న్ గిఫ్ట్ కి టీయారెస్ అధినాయకత్వం ఏం చేయాలన్న ఆలోచనలో పడింది అంటున్నారు.
దీని మీద ప్రత్యేకంగా సమావెశమైన కేసీయార్ అందుబాటులో ఉన్న మంత్రులకు ప్రజా ప్రతినిధులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్రంలో ఉన్నది మోడీ అమిత్ షాల పాలన. ఒకటి అంటే నాలుగు రిటర్న్ గిఫ్టులు పంపుతారు. తమ దాకా వస్తే కూడా కుట్టకుండా ఉంటారా. అందుకే ఇపుడు కేసీయార్ గులాబీ తోట చుట్టూ దాడుల దండు చేరింది. మరి ఈ కధ ఎందాకో ఎన్నాళ్లో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.