Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆకర్ష్ పథకమా ?
By: Tupaki Desk | 17 Jun 2022 2:30 PM GMTవచ్చే నెలలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలో సొంతంగా తెచ్చుకునే ఓట్లతోనే తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలని నరేంద్ర మోడీ ప్లాన్ చేసినట్లున్నారు. సొంతంగా పార్టీ బలంపైనే అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ బలం బాగా పెంచుకోవాలి. బీజేపీ బలం ఇప్పటికిప్పుడు పెరగాలంటే ఏమి చేయాలి ? ఏమి చేయాలంటే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాలి. ఇపుడు కమలం పార్టీ మొదలుపెట్టిందిదే.
బీజేపీ పాలితరాష్ట్రాల్లోని ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను వలలో వేసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాల ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురి చేస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి సొంతంగా 48.9 శాతం ఓట్లు.
ఈ బలాన్ని 50 శాతం దాటించుకుంటే కానీ సొంత బలం పెరగదు. 50 శాతం బలం దాటాలంటే 12 వేల ఓట్లు అవసరం. అందుకనే బీహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు గోవా, హర్యానాలోని ప్రతిపక్ష ఎంఎల్ఏలకు గాలం వేస్తోంది.
ఇంతటితో ఆగని బీజేపీ అగ్రనేతలు పనిలోపనిగా రాజస్థాన్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలపైన కూడా కన్నేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలు ఎవరైనా గాలానికి తగలకపోతారా అనే ఆలోచనతోనే గాలం వేస్తోంది. పై రాష్ట్రాల్లో సుమారు 25 మంది ఎంఎల్ఏలను లాగేసుకోవాలనే టార్గెట్ గా పావులు కదుపుతోంది. గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో ఏకంగా 10 మంది బీజేపీలోకి మారిపోయే అవకాశాలున్నాయని ప్రచారం పెరిగిపోతోంది.
మొత్తం మీద ఏదో రూపంలో ప్రతిపక్షాలను ప్రశాంతంగా బతకనీయకూడదన్న లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు వ్యూహాలు పన్నుతున్నారు. నరేంద్ర మోదీ ఉద్దేశ్యం చూస్తుంటే ప్రతిపక్షాలను బతకీయకూడదన్నట్లే ఉంది. పైకేమో ప్రతిపక్షాలుండాలని చెబుతునే లోలోపల మాత్రం ప్రతిపక్షాలను పూర్తిగా నాశనం చేసే ప్లాన్ నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు.
అందుకనే ముందు కర్నాటక, తర్వాత మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేశారు. రాజస్ధాన్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇపుడు రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపటమే ఆశ్చర్యంగా ఉంది.