Begin typing your search above and press return to search.
బీజేపీకి కొత్త సారధి...జగన్ కి పక్కా రాజకీయ విరోధి
By: Tupaki Desk | 6 Oct 2022 8:49 AM ISTఆయన పేరుని ట్విస్ట్ చేసి వైసీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శల జడివాన కురిపిస్తూ వచ్చారు. సత్యాలు చెప్పకుండా అసత్యాలు చెబుతూ బురద జల్లుతున్నారని కూడా నిందించారు. ఒక విధంగా ఏపీ బీజేపీ విమర్శలను వైసీపీ లైట్ గా తీసుకుంటుంది. కానీ ఆయన కామెంట్స్ చేస్తే మాత్రం సర్రున లేస్తుంది, మంత్రుల స్థాయిలోనే కౌంటర్లు ఇస్తూంటారు. మరి అంతలా వైసీపీకి ఎదురు నిలిచే నాయకుడు ఏపీ బీజేపీలో ఉన్నారా అంటే ఉన్నారు ఆయనే సత్యకుమార్ అని చెబుతున్నారు. ఆయన జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తనకు అప్పగించిన ప్రాంతాలలో గెలుపు అవకాశాలను పెంచడంతో సక్సెస్ అయిన సత్యకుమార్ మీద కేంద్ర పెద్దలకు మంచి అభిప్రాయం ఉంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సత్యకుమార్ వైసీపీ మీద తరచూ హార్ష్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఆయన ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థతో వైసీపీని పోల్చి ఏపీ పాలిటిక్స్ ని ఒక్క లెక్కన షేక్ చేసి పారేశారు.
ఈ సత్యకుమార్ ఎవరు, ఈయన్ని అసలు ఎవరైనా నలుగురు గుర్తిస్తారా అంటూ వైసీపీ మంత్రి జోగి రమేష్ గట్టిగా రిటార్ట్ ఇచ్చే దాకా ఈ కామెంట్ వెళ్ళింది. అయితే దానికి ధీటుగా సత్యకుమార్ తనను అంతా బాగా గుర్తుపడతారంటూ తానెళ్ళిన చోట లభించిన స్వాగతాలతో కూడిన ఫోటోలను ట్వీట్ చేస్తూ వైసీపీ నేతలను కవ్వించారు. ఇలా ఏపీలో వైసీపీని దారుణంగా విమర్శిస్తూ ఎప్పటికపుడు మాటలతో చెడుగుడు ఆడుతున్న సత్యకుమార్ కనుక ఇపుడు ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్ అయితే కధ ఎలా ఉంటుంది.
ఎలా ఉంటుంది అనే దానికంటే ఫస్ట్ వైసీపీకి మంటెక్కిపోతుంది అని అనుకోవాలేమో. కేంద్ర పార్టీ పదవిలో ఉంటూనే ఏపీ వైసీపీ మీద విమర్శలు చూస్తూ దూకుడు పెంచుతున్న సత్యకుమార్ ఏపీ సారధి అయితే వైసీపీకి పక్కలో బల్లెంగా మారి పక్కా రాజకీయ విరోధిగా నిలిచే ప్రమాదం అయితే పొంచి ఉందనే అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు కోరుకునే వారిలో సత్యకుమార్ ముందు వరసలో ఉంటారని కూడా అంటున్నారు. ఇది ప్రచారంలో ఉన్న విషయం.
ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకుని సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో ఈ ప్రచారం పుట్టిందా లేక ఆయన రాజకీయ ఎత్తుగడలతో ఇలా అనుకునేలా చేస్తున్నారా అన్నది తెలియదు కానీ సత్యకుమార్ మాత్రం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ జోలికి అసలు వెళ్లడం లేదు. ఈ విషయాన్ని కూడా వైసీపీ ఎలుగెత్తు ప్రచారం చేస్తున్నా ఆయన తన రూట్ హీట్ ఏ మాత్రం మార్చుకోవడంలేదు.
అలాంటి సత్యకుమార్ ని ఏపీ బీజేపీ పెద్దగా చేస్తారా అంటే ఏమో ఏపీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇది అవసరం అనిపిస్తే చేస్తుంది అనే అంటున్నారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది. ఏపీలో టీడీపీకి దూరంగా సొంతంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. అయితే సత్యకుమార్ లాంటి బీజేపీ అనుకూల నాయకుడిని కనుక పట్టం కట్టి ఫీల్డ్ లోకి వదిలితే అది కచ్చితంగా సైకిల్ పార్టీతో దోస్తీకి ద్వారాలు తెరచినట్లే అవుతుంది అన్న వారూ ఉన్నారు.
అలా కనుక జరిగితే జగన్ కి అది అతి పెద్ద రిస్క్ అవుతుంది అని కూడా చెబుతున్నారు. అసలే గెలుపు వ్యూహాలలో కొత్త రూట్లు వెతిక్రే నైపుణ్యం ఉన్న సత్యకుమార్ కి కేంద్రం అండ ఉండి, మరో వైపు టీడీపీని దోస్తీగా తెచ్చుకుంటే పాత నేస్తం పవన్ కూడా కలసి టోటల్ గా వైసీపీకి సినిమా ఏంటో చూపించేస్తాయి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మరి జగన్ మీద కేంద్ర పెద్దలకు విశ్వాసం తగ్గినా బాబు మీద మోజు పెరిగినా సత్యకుమారే ఏపీ టీడీపీ చీఫ్ అనే అంటున్నారు. చూడాలి మరి ఆ కధ ఎటు వైపు నుంచి ఎలా సాగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.