Begin typing your search above and press return to search.
బీజేపీ 'ఆపరేషన్ టీడీపీ': ఏపీలో ఏదో జరుగుతోంది.?
By: Tupaki Desk | 26 Nov 2019 7:39 AM GMTఆపరేషన్ టీడీపీ ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. ఏపీలో కుదేలైన టీడీపీని హైజాక్ చేసి ఆ నేతలను చేర్చుకొని అధికార వైసీపీ కి ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే 2024 వరకు టీడీపీ స్థానంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తాజాగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వేదిక గా ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఈ మొత్తం ఎపిసోడ్ లో కీరోల్ పోషిస్తున్నారు. టీడీపీ నేతలను బీజేపీలోకి లాగే వ్యవహారంలో పూర్తి బాధ్యతలను సుజనా చౌదరి నెత్తిన పెట్టినట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఢిల్లీలోని ఎంపీ సుజనా చౌదరి నివాసానికి లంచ్ భేటి కోసం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం మధ్యలోనే టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం ఫైర్ బ్రాండ్ జేసీ దివాకర్ రెడ్డి రావడం.. వారితో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురి భేటి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
జేపీ నడ్డా, జేసీ దివాకర్ రెడ్డి ఏపీలో బీజేపీ బలోపేతం.. టీడీపీ ని తుత్తునియలు చేయడం.. అధికార వైసీపీని ఎలా ఢీకొట్టాలనే విషయంలో చర్చించినట్టు సమాచారం. ఇక టీడీపీ నుంచి వలసలు ప్రోత్సహించే బాధ్యతను సుజనాచౌదరికి అప్పగించినట్టు తెలిసింది. జేసీని కూడా ఇందు లో పాలు పంచుకోవాలని కోరినట్లు తెలిసింది. ఏపీలో బీజేపీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి సుధీర్ఘ భేటి జరిగినట్లు తెలిసింది.
డిసెంబర్ 8న విజయవాడ లో జరిగే పదాదికారుల సమావేశానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరువుతున్నారు. ఆ భేటిలో కీలక టీడీపీ నేతల ను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని.. టీడీపీ నేతలను లాగేసి భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎత్తులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే రోజుల్లో టీడీపీ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.