Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధానిపై బీజేపీ స్టాండ్ ఎటు... !

By:  Tupaki Desk   |   21 Sep 2022 11:30 PM GMT
ఏపీ రాజ‌ధానిపై బీజేపీ స్టాండ్ ఎటు... !
X
అవును.. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? ఎటు వైపు నిల‌బ‌డుతుంది? ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తుంది? ఇదీ.. ఇప్పుడు.. రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చోటు చేసుకు న్న అనూహ్య‌మైన ప‌రిణామం.. రాజ‌కీయంగానేకాకుండా.. మేధావి వ‌ర్గాల్లోనూ..చ‌ర్చ‌కు వ‌చ్చింది.

సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. రాష్ట్ర హైకోర్టు.. రైతుల వాద‌న‌వైపే మొగ్గింది. ప్ర‌భుత్వం.. రాజ‌ధాని అమ‌రావ‌తి నే నిర్మించాల‌ని.. అక్క‌డే రైతుల‌కు ఆరు మాసాల్లోగా ఫ్లాట్లు ఇవ్వాల‌ని పేర్కొంది.

అంతేకాదు.. ప్ర‌భుత్వానికి.. రాజ‌ధానిపై చ‌ట్టాలు చేసే అధికారం కూడా లేద‌ని తెలిపింది. ఇది అప్ప‌ట్లో రైతుల‌కు ఆనందం క‌లిగిస్తే.. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ క్ర‌మంలోనే హైకో ర్టు.. ఆదేశాల‌ను ప్ర‌భుత్వం ఎక్క‌డా పాటించ‌లేదు.అంతేకాదు.. క‌నీసం.. అమ‌రావ‌తిలో ఎలాంటి కార్య‌క్ర మాలు కూడా చేప‌ట్ట‌లేదు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మ‌రింత బ‌లంగా.. సీఆర్ డీఏ ర‌ద్దు చ‌ట్టం తీసుకువ‌స్తా మని.. మూడు రాజ‌ధానుల బిల్లు తెస్తామ‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్గా ఉంది. కానీ... ఇప్పుడు.. అనూహ్యంగా సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయ డం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల‌ని కోర‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఈ విష‌యంలో కేంద్రంలో ని బీజేపీ ప్ర‌భుత్వాన్ని కూడా.. రాష్ట్ర స‌ర్కారు ఇరికించింది.

గ‌తంలో హైకోర్టులో కేంద్రం.. రాష్ట్ర రాజ‌ధాని రాష్ట్రాల ఇష్ట‌మేన‌ని.. అఫిడ‌విట్ ఇచ్చింద‌ని.. తెలిపింది. అయినా.. హైకోర్టు ప‌ట్టించుకోలేద‌ని పేర్కొంది. సో.. ఈ కార‌ణంగా.. ఇప్పుడు సుప్రీం కోర్టుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఏం చెబుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌ధానిపై మౌనంగా ఉన్న కేంద్రం.. ఇటీవ‌లే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచే సానుకూలంగా ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని.. పార్టీ నేత‌లు.. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు చెబుతున్నారు. సో.. దీనిని బ‌ట్టి.. ఇప్పుడువారు సుప్రీం కోర్టులో ఎలాంటి వాద‌న వినిపిస్తారు.? రైతుల‌కు అండ‌గా నిలుస్తారా? రాజ‌ధానిని నిల‌బెడ‌తారా? లేక‌.. ప్ర‌భుత్వ ఇష్ట‌మేన‌ని.. చెప్పి.. చేతులు దులుపుకొంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి మ‌రి ఏం చేస్తారో!!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.