Begin typing your search above and press return to search.
బీజేపీ ఆశలన్నీ 'ఆమె' మీదేనా ?
By: Tupaki Desk | 5 Feb 2022 4:43 AM GMTఉత్తరప్రదేశ్ మొదటి విడత పోలింగ్ సందర్భంగా బీజేపీ ఆశలన్నీ బీఎస్పీ అధినేత్రి మాయావతి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుంది. యూపీ పశ్చిమ ప్రాంతంలో 128 సీట్లున్నాయి. వీటిల్లో 58 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. 128 సీట్లలో జాట్లు, ముస్లింలదే ప్రాబల్యం. పై రెండు సామాజిక వర్గాలు గట్టిగా అనుకుని ఏకతాటిపై నిలిస్తే అంతే సంగతులు. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరికి ఓట్లేయాలని అనుకుంటే మిగిలిన పార్టీలకు పెద్ద దెబ్బనే చెప్పాలి.
క్షేత్రస్ధాయిలోని జనాల మూడ్ చూస్తే జాట్లు, ముస్లింలు వివిధ కారణాలతో బీజేపీ మీద మండిపోతున్నారు. కాబట్టి సహజంగానే వాళ్ళ ఓట్లలో మెజార్టీ బీజేపీ ప్రత్యర్ధులకు పడే అవకాశాలే ఎక్కువ. ఇక్కడ ప్రత్యర్ధి అంటే ప్రధానంగా ఎస్పీ కూటమే. అయితే ఇంతకాలం స్తబ్దుగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ల కేటాయింపులో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమి తరపున 15 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
వీళ్ళని దెబ్బకొట్టడానికి మాయావతి కూడా సరిగ్గా అనే నియోజకవర్గాల్లో ముస్లింలనే రంగంలోకి దింపింది. బీఎస్పీకి తోడు ఎంఐఎం కూడా పూర్తిగా ముస్లింలనే పోటీచేయిస్తోంది. అంటే 15 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్ధుల మధ్యే ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా హిందువులకే టికెట్లిచ్చింది. ముస్లింల మధ్య ఓట్లు చీలిపోయి తమకు లాభిస్తుందనేది బీజేపీ అంచనా. అయితే ఇప్పటికే బీఎస్పీ అంటే బీజేపీకి బీ టీమ్ అనే ప్రచారం ఉంది.
బీఎస్పీ మీదున్న ప్రచారం కారణంగా కేవలం ముస్లింల ఓట్లు చీల్చేందుకే మాయావతి ప్రయత్నిస్తున్నారని ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమి ఆరోపిస్తోంది. వీళ్ళ ఆరోపణల్లో నిజముందని ముస్లింలు ఏకీభవిస్తే ముస్లింల ఓట్లు ఏకపక్షంగా ఎస్పీ+ఆర్ఎల్డీ కూటమికి పడుతుంది. అలాకాకుండా ముస్లింల్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఓట్లేసుకోవాలని అనుకుంటే కచ్చితంగా బీఎస్పీకి కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. అప్పుడు ముస్లిం ఓట్లలో చీలిక తప్పదు. అందుకనే మాయావతి పార్టీ చీల్చే ఓట్లపైనే బీజేపీ ఆశలు పెట్టుకుందట. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.