Begin typing your search above and press return to search.
మెగాస్టార్ వెరీ వెరీ స్పెషల్... .అచ్చం రజనీకాంత్ లాగానే ...?
By: Tupaki Desk | 22 Nov 2022 7:57 AM GMTసౌత్ లో బీజేపీకి ఏ రకంగా పట్టు లేదు. ఎంత ప్రయత్నం చేసినా సొంతంగా ఎదగలేకపోతోంది. తమిళనాడులో ఉన్నన్ని హిందూ దేవాలయాలు ఎక్కడా లేవు. కానీ అక్కడ బీజేపీ బోణీ కొట్టలేకపోతోంది. అలాగే దేవభూమి గా పేరుగడించిన కేరళాలో సైతం దేవుడు పార్టీ బీజేపీకి ఎర్ర సిగ్నల్ కనిపిస్తోంది. ఇక కర్నాటకలో పాగా వేసినా కూడా యడ్యూరప్ప వాటావే అందులో ఉంది.
ఇపుడు అక్కడ కూడా డౌట్ కొడుతోంది. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు తెలంగాణా ఆంధ్రాలో ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కమల వికాసం మాత్రం జరగడం లేదు. ఈ అయిదు రాష్ట్రాలు కలుపుకుని ఏకంగా 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం లోక్ సభ సీట్లలో అయిదవ వంతు అన్న మాట.
అయినా బీజేపీకి దక్కేవి ఎపుడూ ముప్పయి అయిదు మించడంలేదు. ఇపుడు కర్నాటకలో కూడా సీన్ రివర్స్ అయ్యేట్లుగా ఉంది. వచ్చే ఎన్నికలలో నార్త్ బీజేపీకి పక్కాగా హ్యాండ్ ఇస్తుంది అన్న డౌట్లు ఉన్నాయి. దాంతో సౌత్ నుంచి బాగా ఓట్లూ సీట్లూ గుంజుకోవాలన్న పవర్ ఫుల్ స్ట్రాటజీతో బీజేపీ ఉంది.
ఈ నేపధ్యంలో తెలుగునాట బీజేపీ పెద్ద చూపు ఉంది. అందుకే వరసబెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రధాని మోడీ ఏకంగా అరగంట పాటు ఏకాంత భేటీకి చాన్స్ ఇచ్చారు. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి వంతు అన్నట్లుగా ఉంది. ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కింది.
ఆ వెంటనే ప్రధాని మోడీ ప్రత్యేకించి మెగాస్టార్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు. దీనికి ముందు కూడా భీమవారంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధానితో పాటు వేదిక మీద చిరంజీవికి సీటు చోటూ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తూంటే మెగా ఫ్యామిలీని బాగా దువ్వుతున్నట్లుగా ఉంది అంటున్నారు.
చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నూటికి నూరు శాతం అర్హుడే. అయితే ఇపుడు బీజేపీ వారి రాజకీయాలు చూస్తే ఏది చేసినా ఊరకే చేయరు అని అంటారు. పైగా వారు పక్కా ప్లాన్ తోనే ఏదైనా చేస్తారు అని అంటున్నారు. ఇక దేశంలో వరసబెట్టి సినీ సెలబ్రిటీలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.
ఆ విధంగా మెగాస్టార్ కి కూడా గేలం వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ మధ్యనే పద్మవిభూషణ్ అవార్డుతో పాటు దాదాఫాల్కే అవార్డు లభించింది. ఆయనతో బీజేపీ ప్రత్యేకమైన స్నేహాన్ని చేస్తూ వస్తోంది. ఆయన ప్రభావంతో ఆయన ఇమేజ్ తో తమిళసీమను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ చూసింది
అయితే రజనీకాంత్ అనారోగ్యం పాలు కావడంతో ఆ విషయంలో బీజేపీ ప్లాన్ సక్సెస్ కాలేదు. ఇపుడు ఏపీ వైపు తెలంగాణా వైపు కూడా బీజేపీ చూస్తోంది. అందుకే మెగాస్టార్ ని నమ్ముకుంటోంది అని అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీకి చెందిన నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ మధ్యనే అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచి పెద్ద పీట వేశారు.
అదే విధంగా తెలంగాణా గవర్నర్ తమిళ్ సై కూడా మెగాస్టార్ తో మంచిగా ఉంటూ వస్తున్నారు. తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో తన అన్ని కార్యక్రమాలకు చిరంజీవిని ఆహ్వానించారు కూడా. ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీకి ఒక కచ్చితమైన అజెండా ఉందని అంతున్నారు. అప్పట్లోనే గుజరాత్ ప్రభుత్వం లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్‌ను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందని గుర్తు చేసుకుంటే కనుక సినీ సెలిబ్రిటీలను తమ వైపునకు తిప్పుకోవడం విషయంలో బీజేపీ మిగిలిన పార్టీల కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అని చెప్పాలి.
ఇలా కనుక విశ్లేషించుకుంటే మెగాస్టార్ నుంచి బీజేపీ చాలా ఆశిస్తోంది అని చర్చ అయ్యితే సాగుతోంది. మెగాస్టార్ ఇప్పటికీ రాజకీయాల్లో లేరు. అయితే ఆయన తమ్ముడు జనసేన తరఫున పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఆయనకు చిరంజీవి మద్దతుగా ఉంటున్నారు.
ఆ జనసేన బీజేపీకి మిత్ర పక్షంగా ఉంది. ఇలా చూస్తా బీజేపీకి వేలు విడవని చుట్టమే మెగాస్టార్ అవుతారు అని చమత్కరిస్తున్నరు. సో వీటన్నింటికీ చూస్తూంటే చిరంజీవి తో చాలా పెద్ద పనులనే చేయించుకుని తాము లాభపడాలని బీజేపీ మెగా ప్లాన్ వేసింది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.