Begin typing your search above and press return to search.
సొంతంగా బీజేపీ...ఏపీ పార్టీలకు షాకులు....?
By: Tupaki Desk | 9 Oct 2022 3:30 PM GMTబీజేపీ ఆలోచనలు అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలకు దెబ్బేయడానికే ఉంటాయి. దానికి ఏపీ కూడా అతీతం కాదు, అధికారంలో ఉంటూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నా కూడా వైసీపీ మీద బీజేపీకి ప్రేమ ఏమీ ప్రత్యేకంగాలేదు. ఇదంతా రాజకీయాల్లో భాగమనే లైట్ తీసుకుంటుంది. ఇక తనతో పొత్తు కోసం టీడీపీ వేచి చూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోదు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ అవసరాలు కూడా బీజేపీ బాగా తెలుసు.
వీటికంటే కూడా మరో అతి కీలకమైన విషయం కూడా బీజేపీకి తెలుసు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలిచినా లేక బొమ్మ తిరగబడి టీడీపీ గెలిచినా కూడా వారికి వచ్చే ఎంపీ సీట్లు గంపగుత్తగా తమ ఖాతాలో పడతాయని. అందువల్ల ఏపీ వరకూ బే ఫికర్ గా కమలనాధులు ఉన్నారు. ఇంతటి సానుకూలత మరే రాష్ట్రంలోనూ బీజేపీకి లేదు.
అలాంటపుడు ఏపీ విషయంలో తమకు వీలైన ప్రయోగాలు చేస్తే తప్పేంటి వేస్తే వెంట్రుక వస్తే కొండ అన్నట్లుగా భారీ లాభమే కదా అన్నది బీజేపీ ఆలోచన. అందుకోసం బీజేపీ దేసంలో తాము అధికారంలోకి రాలేని 144 సీట్ల మీద కన్ను పెట్టి అక్కడ కష్టపడితే తమకు అవకాశాలు బాగా ఉంటాయని భావించి గురి పెడుతోందిట.
ఆ 144 సీట్లలో ఏపీలోని నాలుగు సీట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ సీట్లు విశాఖపట్నం. నర్సాపురం, విజయవాడ, తిరుపతి అని చెబుతున్నారు. ఇక్కడ సర్వేలు కూడా చేపడుతూ వస్తున్న బీజేపీ కష్టపడితే సొంతంగా కమల పతాకను ఎగరవేయవచ్చు అని నమ్మకంగా ఉందిట.
ఇక దేశమంతా గుర్తించిన 144 సీట్లలో ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు కీలక నేతలు వరస పర్యటనలకు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అక్కడ మేధావులు, ప్రజా సంఘాలు, విద్యా వేత్తలు, వివిధ సంఘాల వారితో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా బీజేపీ మీద వారి అభిప్రయాన్ని సానుకూలంగా మళ్ళించాలని చూస్తున్నారుట.
ఇక ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే అన్నట్లుగా ఇస్తున్న సందేశం వైసీపీ, టీడీపీలకు ఎలాంటి షాకులు ఇస్తుంది అన్నదే చూడాలని అంటున్నారు. ఇక బీజేపీ ఏపీలో ఎంపిక చేసుకున్న ఈ నాలుగు సీట్లలో మూడింటిని గతంలో గెలుచుకుంది. ఎంతో కొంత ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఇపుడు మరింతగా కష్టపడితే తమ ఖాతాలో పడతాయని భావిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో బీజేపీ ఒంటరు పోరు చేస్తే తమకే మంచిదని వైసీపీ లెక్కలేసుకుంటోంది. ఓట్లు చీలి చివరికి తన పంట పడుతుందన్నది వైసీపీ ఆలోచన. అదే టైం లో టీడీపీ అయితే బీజేపీ అంతటి సాహసం చేయదని, ఎన్ని సర్వేలు చేసినా మినిమం బేస్ కూడా లేని చోట బీజేపీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పలేరని అంటోంది. అందువల్ల చివరాఖరున అయినా తమతో పొత్తులకు రాక తప్పదని ధీమా పడుతోంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఏపీలో నాలుగు సీట్ల మీద కన్నేసిన బీజేపీ మీద ఆ రెండు పార్టీలు ఇంకా ఆశలతోనే ఉన్నాయని అంటున్నారు. అయితే బీజేపీ ఇలా మైండ్ గేం ఆడుతూ ప్రాంతీయ పార్టీలను తన దారిలోకి తెచ్చుకోవడమో, లేక వీలు దొరికితే తొక్కేయడమో చేయాలన్నదే పక్కా మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. చూడాలి మరి ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే నిజంగా కట్టుబడి ఉంటుందా లేక జగన్ కి ఝలక్ ఇచ్చి టీడీపీతో కలుస్తుందా. లేక టీడీపీని ఇలా బెదిరించి ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందా అన్నది తేలాలంటే ఇంకా చాలా టైం ఉంది మరి.