Begin typing your search above and press return to search.
‘ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే’.. ఆ లీడర్ పరిస్థితిదీ.?
By: Tupaki Desk | 9 Sep 2020 10:30 AM GMT‘అయ్యయ్యో.. చేతిలోని పదవి పోయనే.. అయ్యయ్యో.. ఉన్నది కాస్త ఊడింది.. సర్వమంగళం పాడింది’ అని ఇప్పుడు ఆ దిగ్గజ ఏపీ నేత విషాద రాగాలు ఆలపిస్తున్నాడట.. మొన్నటి వరకు జాతీయ పార్టీకి పెద్దమనిషి అయిన ఆయన ఇప్పుడు పదవి ఊడిపోయి.. పార్టీలో ప్రతిష్ట దిగజారి ‘ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే’ అని తెగబాధపడుతున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో , రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఆయన ఏపీ పులి. అపర కాంగ్రెస్ వాది అయిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పాపులర్ అయిన ఈయన ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాపులకు రంగా చనిపోయిన తర్వాత వారసుడిగా ఫోకస్ అయ్యాడు. ఆయనే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి పోయాక కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుక మాదిరి అయ్యిందంట.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లాలని కన్నా గట్టిగా భావించాడు. ఇక రేపు వైసీపీలో చేరాలని ఫిక్స్ అయిన తరువాత అనూహ్యంగా అమిత్ షా నుంచి కన్నాకు ఫోన్ వచ్చింది. వైసీపీలోకి వెళ్లవద్దని.. నీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాం అని చెప్పి వైసీపీలోకి పోకుండా చేశారు. బీజేపీ అయితే జాతీయ పార్టీ.. పైగా అధికారంలో ఉందని ఆశపడి కన్నా ఆగిపోయాడు. బీజేపీలో చేరిపోయాడు.
బీజేపీ అధ్యక్ష పదవిని రెండేళ్ల తరువాత పాపం చంద్రబాబు మీద కోపంతో కన్నాకు తీసివేశారు. కేంద్ర బీజేపీ నాయకత్వం ఇప్పుడు కన్నాను అస్సలు పట్టించుకోవడం లేదంట.. కనీసం కన్నాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు అని.. ఆయన మనుషులకు కూడా నోటీసులు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇలా కన్నా పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అమిత్ షా చేశాడని ఆయన అనుచరవర్గం తెగ బాధపడుతోందట.. వైసీపీలోకి వెళ్లి ఉంటే బొత్స సత్యనారాయణ మాదిరి మంత్రి అయ్యేవాడినని.. ఇప్పుడు ఎటూ కాకుండా పోయానని కన్నా లక్ష్మీనారాయణ మథన పడుతున్నాడంట.. చూద్దాం కన్నా లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో ఎలా ముందుకెళ్తాడో..