Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ పైకి బీజేపీ ‘ఈటె’ల
By: Tupaki Desk | 15 Nov 2021 11:30 AM GMTకన్నును కన్ను.. పన్నుకు పన్ను.. తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇది. దీన్ని కొద్దిగా వర్తమాన రాజకీయాలకు వర్తింపజేస్తే.. గుట్టుమట్లు తెలిసినవారితోనే ప్రత్యర్థి ని ఓ పట్టు పట్టడం. ఇప్పుడీ వ్యూహాన్నే బీజేపీ.. టీఆర్ఎస్ విషయంలో అమలు చేయబోతోంది. దీనికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కీలక ఆయుధం అనడంలో సందేహం ఏముంది? తెలంగాణ రాజకీయాలను ఔపోసన పట్టిన కేసీఆర్ ను ఎదుర్కొని హుజూరాబాద్ లో గెలుపొందడం ఈటల కరిష్మాను అమాంతం పెంచింది. టీఆర్ఎస్ లో ఉన్నంతవరకు ఆ పార్టీ కీలక నేతగా, మంత్రిగానే తెలంగాణ ప్రజలకు పరిచయం ఉన్న ఈటల ఇప్పుడు రాష్ట్ర నేత. అందుకని ఆ కరిష్మాను మరింత వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలనుంచే ఈ వ్యూహాన్ని లైన్లోకి తేనుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి దీన్ని ఓ కొలిక్కి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లాభానికి లాభం.. కమలం బలం
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు ఉత్సాహం పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో నీరుగారి పోవడంతో బీజేపీ ఓ దశలో ఏం చేయాలతో పాలుపోని స్థితిలో పడింది. అదే సయమంలో పార్టీది ఊపా..? బలమా? బలుపా..? అన్న తెలియని సందిగ్ధం నెలకొంది. ఇదే సమయంలో అనుకోని వరంలా కలిసొచ్చాయి టీఆర్ఎస్ పరిణామాలు. మంత్రిగా ఉన్న ఈటలను ఆ పార్టీ బయటకు పంపడం.. ఆయన కాంగ్రెస్ లో చేరాలా? సొంత పార్టీ పెట్టాలా? బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉండగా కమలనాథులు చురుగ్గా స్పందించి తమలో చేర్చేసుకున్నారు. ఇది ఎంత తెలివైన నిర్ణయమో తాజా హుజూరాబాద్ ఫలితం చాటిచెప్పింది. అరెరె.. ఈటలను చేర్చుకోలేకపోయామే..? అని కాంగ్రెస్ ఇప్పడు నాలుక్కర్చుకుంటుండడం వేరే సంగతి. మొత్తానికి హుజూరావార్ లో బీజేపీ వదిలిని ‘ఈటె’టీఆర్ఎస్ కు బాగానే గుచ్చుకుంది.
ఇక దూకుడే.. ఆగేది లేదు
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఇకపై దూకుడు పెంచాలనుకుంటున్నది . బీజేపీ వ్యూహం ప్రకారం.. మిగతా నేతలకు భిన్నంగా కీలకమైన ప్రజాసమస్యలపై కేసీఆర్ ను నిలదీస్తూ ఈటల ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చేలా కమలనాథులు సరికొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. మున్ముందు ప్రణాళికలు, అవసరాల రీత్యా కూడా కీలకమైన ఆ వ్యూహం అమలులో ఈటలకు కీలక నేతల సహకారాన్ని కూడా అందించేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.ఇతర పార్టీల నేతలను ఇప్పటిదాక టీఆర్ఎస్ ఆకర్షించింది. ఆ వ్యూహాన్నే బీజేపీ అమలు చేయాలనుకుంటున్నది. టీఆర్ఎస్ నే టార్గెట్ చేయాలని భావిస్తున్నది . ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి కమలం గూటికి తీసుకురావాలనుకుంటున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే బీజేపీకి ఈ ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం గట్టిగా దృష్టి పెట్టనున్నది. దీర్ఘకాలిక అనుభవం, టీఆర్ఎస్ లోని నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆ బాధ్యతను ఈటలకే అప్పజెప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఎవరెవరు అసంతృప్తి, అసమ్మతితో ఉన్నారో రాజేందర్ కే ఎక్కువ అవగాహన ఉంటుందని.. అందుకే ఆయనకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నేతలు భావించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఎమ్మెల్సీల్లో టీఆర్ఎస్ను ఇరుకునపెడదాం..
అధికార పార్టీని ఇరుకున పెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీటుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హుజూరాబాద్ గెలుపుతో వేగం పెంచనున్నది. నిత్యం టీఆర్ఎస్ ను ఏదో ఒక రూపంలో ఆత్మ రక్షణలోకి నెట్టాలని, బీజేపీ చుట్టూనే దాని దృష్టి ఉండేలా ఉక్కిరిబిక్కిరి చేయాలనేది ప్లాన్. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను బీజేపీ బరిలో దించి అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. అయితే, సంఖ్యాపరంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా టీఆర్ఎస్ లో క్రాస్ ఓటింగ్ భయాన్ని కలిగించాలని అనుకుంటున్నది . కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని ఆశించి భంగపడినవారితో సంప్రదింపులు జరిపి టికెట్ ఇచ్చి కమలం గూటికి తెచ్చే పనితోనే ఈ వ్యూహాన్ని అమలులో పెట్టాలని అనుకుంటున్నది. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదనే అసంతృప్తిని ఎలా వాడుకోవాలన్న దానిపై బీజేపీకి స్పష్టత ఉన్నది. అధికార పార్టీ అమలు చేయని గత హామీలను ప్రస్తుతం ప్రజలెదుర్కొంటున్న సమస్యలు , వడ్ల కొనుగోలు , నిరుద్యోగం , దళితబంధు .. ఇలా అన్నింటిపై ఆందో ళనలు చేపట్టాలనుకుంటున్నది ..