Begin typing your search above and press return to search.
బీజేపీ వ్యూహం.. కమలనాథులకైనా అర్ధమవుతోందా?
By: Tupaki Desk | 10 Jun 2022 5:30 AM GMTఔను! ఇప్పుడు ఏపీ కమలం పార్టీ నాయకుల్లో ఈ మాటే వినిపిస్తోంది. అసలు మన వ్యూహం ఏంటి? ఎటు వెళ్తున్నాం? వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే మార్గం మనకు కనిపిస్తోందా? అనేది సీనియర్ నాయకులు.. కార్యకర్తల్లో వినిపిస్తున్న మాట. ``మా నాయకులు తలకో మాట చెబుతున్నారు. దీంతో అసలు ఏది వాస్తవమో.. మేం ఎటు పయనించాలో కూడా మాకు అర్ధం కావడం లేదు. అసలు ఇలా అయితే.. పార్టీ పరిస్థితి ఏంటో కూడా తెలియడం లేదు.`` అని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదే మాట.. రాయలసీమకు చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. బీజేపీ జాతీయ నా యకులు ఒక మాట మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి చెందిన నేతలు.. మరో వాదన వినిపిస్తున్నారు. దీంతో పార్టీలో నేతలు ఎటు అడుగులు వేయాలనే విషయం తర్జన భర్జనగా మారింది. ఎందుకంటే.. రాష్ట్రంలో ఇప్పుడు.. జనసేనతో పార్టీ పొత్తులో ఉంది. కలిసి పనిచేస్తున్నారా? కలిసి వ్యూహాలు రచిస్తున్నారా? అనే విషయాన్ని పక్కన పెడితే.. పొత్తు అనే మాట మాత్రం వాస్తవం. ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు.
``మేం జనసేనతో పొత్తులో ఉన్నాం. పొత్తు కొనసాగుతుంది. చిన్న చిన్న లోపాలు ఉంటే.. సరిచేసుకుం టాం.. కానీ, పొత్తు మాత్రం ఉంటుంది`` అని ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి చెప్పారు. ఇక, రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. తమకు జనసేనతోనే పొత్తు ఉంటుందని.. ఎవరినో పీఎం చేయడానికో.. సీఎం చేయడానికో.. బీజేపీ పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. రాష్ట్ర నేతల మాటలను బట్టి జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని అంటున్నారు.
ఇక, ఇదే పార్టీ జాతీయ నాయకుల విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన నడ్డా.. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
అదేసమయంలో తమతో పొత్తులో ఉందని చెబుతున్న జనసేన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొత్తు ఉందని కానీ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు సాగుతామని కానీ ఆయన చెప్పలేదు. అంతేకాదు.. టీడీపీ విషయానికి వస్తే.. ``టీడీపీ బస్సు కొద్ది తేడాతో మిస్సయింది`` అని నడ్డా వ్యాఖ్యానించారు.
అంటే.. మిస్ కాకుండా ఉంటే.. గత ఎన్నికల్లోనే టీడీపీతో కలిసి పయనించేవారమని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు భావించాలి. అంటే.. దీనిని బట్టి.. బీజేపీ జాతీయ నాయకత్వం.. జనసేన గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం.. టీడీపీ విషయంలో అంతో ఇంతో సానుకూలతను ప్రదర్శించడం వంటివి చూస్తే.. అసలు .. బీజేపీ వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసిముందుకు సాగుతుంది? తాము ఎలాంటి వ్యూహాలతో ప్రజలకు చేరువ కావాలి? అనే విషయంపై నాయకులు, కార్యకర్తలు తర్జన భర్జనకు గురవుతున్నాయి. ఎన్నికల ముంగిట ఇలాంటి పరిస్థితి రావడం.. బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.