Begin typing your search above and press return to search.
ఖమ్మం మీటింగ్...బీజేపీ గుమ్మంలో టీడీపీ గురించేనట...!
By: Tupaki Desk | 22 Dec 2022 8:46 AM GMTఒకే ఒక్క మీటింగ్. దెబ్బకు అంతా చేంజి అయ్యేలా చేస్తోంది. బీజేపీ పెద్దల దయ కోసం వారి చల్లని చూపు కోసం తెలుగుదేశం మూడున్నరేళ్ళుగా పడరాని పాట్లు పడుతోంది. ఉహూ కుదరలేదు. దాంతో అపర చాణక్యుడు అయిన చంద్రబాబు ఏపీ నుంచి లాభం లేదు అనుకుంటూ తెలంగాణ గేట్ తెరచారు.
తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ గా పునాదులు తెలంగాణాలో ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో ఎపుడూ ఎక్కువ ఓట్లూ సీట్లూ తెలంగాణా నుంచే ఆ పార్టీకి వచ్చినట్లు చరిత్ర రికార్డులో పదిలంగా ఉంది. అందుకే బాబు దాదాపు ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణాలో సైకిల్ స్పీడ్ పెంచేశారు. ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.
టీయారెస్ దెబ్బకు కొంతవరకూ పసుపు ప్రభలకు మసక బారినా కూడా తమ అసలు బలం అలాగే ఉంది అని చెప్పేందుకే బాబు తెలంగాణా నుంచి నరుక్కు వస్తున్నారు. ఎటూ టీయారెస్ బీయారెస్ అయి బాబుకు పక్కాగా తెలంగాణా రూట్ క్లియర్ చేసిన వేళ చంద్రబాబు ఖమ్మం మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అదిరిపోయే లెవెల్ లో సాగింది. ఏకంగా వేయి కార్లతో బాబు ఖమ్మం వెళ్లారు. అక్కడ తండోపతండాలుగా జనాలు వచ్చి మరీ తెలుగుదేశం వెంటపడ్డారు.
బాబు స్పీచ్ కి జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మీటింగ్ చూసిన వారు అంతా తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఆదరణ ఉందా. ఎనిమిదేళ్ళుగా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేకపోయినా ఈ జోరు ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు, ఇక ఈ న్యూస్ అంతా అటూ ఇటూ తిరిగి నేరుగా ఢిల్లీ బీజేపీ పెద్దలకు కూడా చేరింది అని అంటున్నారు. బీజేపీకి తెలంగాణా ఇపుడు కావాలి.
దేశంలో ఎన్నో రాష్ట్రాలను గెలుచుకున్నా సౌత్ లో అందులో తెలుగు రాష్ట్రాలలో తమ బలాన్ని ఉనికికి చాటుకోలేకపోతున్నామన్న బాధ బెంగ బీజేపీకి ఉన్నాయి. ఇక రెండు సార్లు టీయారెస్ అధికారంలోకి వచ్చింది. ఇక బీయారెస్ గా మారి మూడవ విడత పోటీ చేయబోతోంది. మునుపటి హుషార్ జోష్ కారు పార్టీకి ఇపుడు లేవు అని అంటున్నారు. దాంతో అదే బీజేపీకి కొత్త ఆశలు కల్పిస్తోంది.
ఇక మరో వైపు చూస్తే బీయారెస్ తరువాత క్షేత్ర స్థాయిలో గట్టిగా ఉండే కాంగ్రెస్ ఇపుడు వర్గ పోరుతో సతమతం అవుతోంది. ఢీ అంటే ఢీ కొట్టాల్సిన కాంగ్రెస్ తనకు తానుగా జారిపోతోంది. ఈ అద్భుత అవకాశంతో బీజేపీ తెలంగాణాలో బీజేపీకి అధికార పీఠం ఊరిస్తోంది. అయితే అది బీజేపీ సొంత బలంతో అయితే సాధ్యపడుతుందా అంటే కుదిరేది లేదని అంటున్నారు.
ఎంతలా బీజేపీ స్పీడ్ పెంచినా సొంతంగా బలంతో ఇప్పటికిపుడు అధికారంలోకి వచ్చే సీన్ అయితే లేదు. దాంతో తెలుగుదేశం తెలంగాణాలో తన బలాన్ని నిరూపించుకుంటున్న క్రమంలో ఆ పార్టె గురించి బీజేపీ ఢిల్లీ పెద్దలలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయని అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి తెలంగాణా ఊరిస్తోంది. తెలుగుదేశం అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో కూడా పొత్తు పెట్టుకుంటేనే తెలంగాణాలో సాధ్యపడుతుంది.
మరి ఈ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు ఏమి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం చర్చగా ఉంది. తెలంగాణా బీజేపీలో జగన్ అనుకూలురు కొందరు చేరి బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కుదరకుండా చేస్తున్నారని టాక్. మొత్తానికి ఖమ్మం సభ కాస్తా బీజేపీ గుమ్మం దాకా టీడీపీ సత్తా ఏంటో వెళ్లేలా చేసింది అంటున్నారు. తెలుగుదేశం తెలంగాణాలో మరిన్ని మీటింగ్స్ కి రెడీ అవుతోంది. దంతో చాలా తొందరలోనే బీజేపీ టీడీపీతో పొత్తుకు సై అనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక తెలంగాణాలో తొందరలో ఎన్నికలు వస్తాయని అంతా భావిస్తున్న టైంలో ఈ పొత్తులు కుదిరితే కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో గణనీయమైన మార్పు రావడం తధ్యమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.