Begin typing your search above and press return to search.

ఆపరేషన్ తెలంగాణ.. రంగంలోకి మోడీ-షా.. మరో కేంద్రమంత్రి ఆఫర్

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:43 AM GMT
ఆపరేషన్ తెలంగాణ.. రంగంలోకి మోడీ-షా.. మరో కేంద్రమంత్రి ఆఫర్
X
గుజరాత్ లో గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ప్రధాని మోడీ-షాలు ఇప్పుడు దక్షిణాదిలో తమకు గెలుపు అవకాశాలు ఉన్న తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రెండు సార్లు గెలిచిన వ్యతిరేక టీఆర్ఎస్ పై.. ఇక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుండడంతో ఇదే అదునుగా తెలంగాణను గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ రంగం సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది మాత్రమే టైం ఉండడంతో తెలంగాణలో పార్టీ విస్తరణ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ప్రధాని మోడీ-హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 'ఆపరేషన్ తెలంగాణ' మొదలుపెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ తెరతీస్తోంది. కాంగ్రెస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా పార్టీ బలోపేతం, ఇతర పార్టీల నుంచి చేరికలకు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరించింది. కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. కొందరు కాంగ్రెస్ సీనియర్లను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రణాళికను వేగవంతం చేస్తోంది.

తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి రావాలంటూ ఓపెన్ ఆఫర్ లు ప్రకటించారు. స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇక కేసీఆర్ లక్ష్యంగా ఈటల రాజేందర్ ను రంగంలోకి దించి టీఆర్ఎస్ నేతలను లాగే పనిని అప్పగించారు.

వీరంతా కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని గుర్తించాలని టాస్క్ డిసైడ్ చేశారు. వచ్చే రోజుల్లో బీజేపీలో చేరికలు పెద్దసంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణ చేసి తెలంగాణ బీజేపీ నుంచి మరో బీసీ నేతకు కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. బీసీ నేతకే పదవి ఇవ్వాలనేది ప్రదాని మోడీ-అమిత్ షా ఆలోచనగా ముఖ్య నేతలు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.