Begin typing your search above and press return to search.
కమ్మలు..కాపులు అయిపోయారు ఇక రెడ్ల మీదనే బీజేపీ గురి?
By: Tupaki Desk | 11 Aug 2021 12:30 PM GMTఏపీలో పార్టీ వెలిగిపోవాలన్న ఆశ కమలనాథుల్లో అంతా ఇంతా కాదు. ఏపీ ప్రజలకు ఏమీ చేయకుండానే వారి మీద పెత్తనం చేయాలన్న ఆశ కమలనాథుల్లో అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు కాంబినేషన్లలో ప్రయత్నించినా.. ఏపీలో బీజేపీ ఇమేజ్ ను పెద్దగా పెంచలేకపోయారు. మధ్య మధ్యలో మెరుపులు మెరిపించినా.. అదంతా కూడా పొత్తు పుణ్యమే తప్పించి.. తమ సొంతం కాదన్న విషయం బీజేపీ అధినాయకత్వానికి బాగా తెలుసు. తాజాగా పార్టీని మరింత బలోపేతం చేయటానికి వీలుగా..పార్టీ నాయకత్వంలో మార్పు తీసుకురావాలన్న యోచనలో అధినాయకత్వం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు స్థానంలో మరెవరికైనా అప్పజెప్పాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర పగ్గాల్ని పలువురు నేతలు చేపట్టినా.. పార్టీకి అవసరమైన జోష్ మాత్రం రాలేదనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి సదరు నేతల కారణం ఎంతనో పార్టీ విధానాలు కూడా అంతే కారణమని చెప్పక తప్పదు. తన బలాన్ని ఎప్పటికప్పుడు ఉన్న దాని కంటే ఎక్కువగా ఊహించుకునే ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తరచూ తగులుతూనే ఉంటాయి. ఆ మధ్యన జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో తమకు మించిన వీరులు ఎవరూ లేరన్నట్లుగా బరిలోకి దిగటమే కాదు.. అక్కడెక్కడో ఉన్న మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభును తీసుకొచ్చి మరి పోటీ చేయించారు.
ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ జనసేన నెత్తిన నీళ్లు పోసి.. స్నేహం పేరుతో షాకిచ్చి మరీ.. ఆ సీటును లాగేసుకున్నారు. ఏదో చేస్తామన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు కానీ చివరకు చూస్తే.. డిపాజిట్ కూడా దక్కించుకోలేని దౌర్బాగ్యపు పరిస్థితిని తెచ్చుకున్నారు. ఈ వైఫల్యానికి కారణం సోమునే అని తేల్చిన అధినాయకత్వం ఇప్పుడు ఆయనపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. సోము వెళ్లిపోతున్నారు సరే.. మరి తర్వాత బాధ్యత ఎవరికి అప్పగించాలన్న మాటకు.. ఏపీ కమలనాథులు చెప్పే ఫార్మూలా వింటే.. విస్మయానికి గురి కావాల్సిందే.
సామాజిక లోతుల్లోకి వెళ్లే బీజేపీ నేతలు.. ఏపీ ప్రజల గుండె చప్పుళ్లు ఎందుకు వినరు? వారు కోరుకున్నది ఇవ్వాలే కానీ.. కమలనాథుల్ని నెత్తిన పెట్టుకుంటారన్న చిన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతారో ఒక పట్టాన అర్థం కానిది. ఇంతకూ ఏపీ బీజేపీ నేతలు చెప్పే సమీకరణలు చూస్తే.. ఇప్పటివరకు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని కమ్మలు.. కాపులకు అప్పజెప్పారు కానీ ఎవరూ పార్టీని అనుకున్నంతగా పాపులర్ చేయలేకపోయారని.. అందుకే ఈసారి రెడ్లకు ఇవ్వాలన్న యోచనలోఉన్నట్లు చెబుతున్నారు.
గడిచిన మూడు దఫాలుగా ఉత్తరాంధ్ర.. కోస్తాకు చెందిన నాయకులకు పగ్గాలు అప్పజెప్పారని.. ఈసారి అందుకు భిన్నంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు పగ్గాలు అప్పజెబితే పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇందుకు నేతలు సిద్ధమా అంటే.. ఆదినారాయణరెడ్డి.. విష్ణువర్దన్ రెడ్డి పేర్లను చెబుతున్నారు. మరి.. సోము స్థానంలో కొత్త నేతను తీసుకొస్తే.. పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశలో ఉన్నారు. మరీ సమీకరణాలు ఎంతవరకు వర్కువుట్ అవుతాయో కాలమే వారికి అర్థమయ్యేలా చెప్పాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.