Begin typing your search above and press return to search.
జల్లికట్టు ఒక్కటే బీజేపీ కి దిక్కు
By: Tupaki Desk | 2 Jan 2017 11:01 AM GMTరాజకీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో - ప్రాంతాల్లో నిలదొక్కుకోవాలంటే ఆ ప్రాంత వాసులకు ఏదో ఒక బలమైన బలహీనత ఉండాలి. ఈ విషయాన్ని గమనించిన అధికారంలో ఉన్న పార్టీలు వాటిని తాయిలంగా ఇస్తే... ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వాటిపై పోరాటాలు చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఫాలోఅవుతూ ఉంటాయి. ఈ విషయంలో తాజాగా తమిళనాడుపై దృష్టిసారించింది బీజేపీ.
జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాలు ఏ స్థాయిలో వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే లో నెలకొన్న పరిస్థితుల సంగతి అలా ఉంటే.. వారితో ప్రస్తుతం స్నేహంగా ఉంటూనే తమకంటూ సొంత మైలేజ్ తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. దీనికోసం జల్లికట్టును తమిళనాడు ప్రజలకు ఈ సంక్రాంతికి తాయిలంగా ఇవ్వాలని యోచిస్తోందట. 2017 సంక్రాంతికి జల్లికట్టును కానుకగా ఇస్తే.. రాజకీయ ప్రయోజనాలకు దోహద పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.
కాగా, జంతుహింసకు కారణమవుతుందనే కారణంతో ఈ జల్లికట్టు సంప్రదాయాన్ని ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జల్లికట్టును అనుమతిస్తూ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ 2016 జనవరి 7న నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డు ఈ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు ఎక్కింది. అయినప్పటికీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో కచ్చితంగా ఈ పొంగల్ కు జల్లికట్టును తమిళనాడు ప్రజలకు తాయిలంగా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/