Begin typing your search above and press return to search.
బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా.?
By: Tupaki Desk | 2 July 2019 10:38 AM GMTఅంతన్నారు.. ఇంతన్నారు.. కానీ బీజేపీలో టీడీపీ రాజ్యసభ ఎంపీల చేరిక తర్వాత ఇప్పటివరకు ఎవ్వరూ చేరలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు 15మంది టచ్ లో ఉన్నారని.. రేపో మాపో లాగేస్తామని వార్తలు సృష్టించారు. కానీ బాబు బుజ్జగించారో.. బీజేపీలో భవిష్యత్ పై నమ్మకం లేదో కానీ ఏపీ టీడీపీ నేతలు - ఎమ్మెల్యేలు అయితే కమళదళంలో చేరలేదు.
ఇక కేసీఆర్ దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ పార్టీలోని కీలక రెడ్డి సామాజికవర్గ బలమైన నేతలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారన్న వార్తలొచ్చాయి. కాంగ్రెస్ లోని కీలక నేతలను చేర్చుకొని టీఆర్ ఎస్ కు ప్రత్యామ్మాయంగా ఎదుగుతామని బీజేపీ నేతలు ఆశించారు. కానీ ఆ ఆశ కూడా నెరవేరలేదు..
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో బస చేసి బీజేపీ లో చేరాలనుకునే వారితో స్వయంగా చర్చలు కూడా జరిపారని వార్తలు వచ్చాయి. చాలా మంది కలిసి వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ ఎంపీల చేరిక తర్వాత పెద్ద ఎత్తున బీజేపీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు వెళ్లింది లేదు.. కలిసింది లేదు..
దీన్ని బట్టి చూస్తే ఏపీలో టీడీపీని.. తెలంగాణలో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీసి.. హైప్ సృష్టించి ఆ పార్టీలోని నేతలను చేర్చుకునేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని పొలిటికల్ అనలిస్టులు ఘంఠా పథంగా చెబుతున్నారు. ఇలా బజ్ క్రియేట్ చేస్తే కొందరు ఊగిసలాట నేతలు చేరితే బలపడాలని బీజేపీ చూస్తోంది. కానీ ముందే సర్దుకుంటున్న తెలుగు రాష్ట్రాల పార్టీలు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నేతలు జారిపోకుండా కాపాడుకుంటున్నారు. దీంతో బీజేపీ ఆశలు ప్రస్తుతానికి నెరవేరేలా కనిపించడం లేదు.