Begin typing your search above and press return to search.
మునుగోడుపై బీజేపీ అస్త్రశస్త్రాలు ఇవే.. జోరు పెరిగిందా?
By: Tupaki Desk | 7 Oct 2022 8:04 AM GMTఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం దక్కించుకునేందుకు బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న ఈ పార్టీ.. చాలా వ్యూహా త్మకంగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ తిరిగి.. ప్రజలను కలవడంతోపాటు.. ప్రచారాన్ని అన్ని స్థాయిల్లో నూ పుంజుకునేలా చేయాలని.. భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు ఏకంగా మునుగోడుకు మకాం మార్చారు.
వాస్తవానికి ఇప్పటికే ఈటల రాజేందర్.. వినోద్ వంటి వారు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. దీనికి మరింత పదును పెంచుతూ.. శుక్రవారం నుంచి మునుగోడులో కమలం పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది.
ఇక, బీజేపీకి దన్నుగా.. ఆర్ఎస్ఎస్ సైతం రంగంలోకి దిగుతోంది. బీజేపీ కన్నా ఎక్కువగా.. ఆర్ ఎస్ ఎస్.. మునుగోడును సీరియస్‌గా తీసుకుంటోంది. బైపోల్స్‌లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. అంతేకాదు.. వ్యూహాలు కూడా సిద్ధం చేస్తోంది.
బీజేపీ నేతలకు.. క్షేత్రస్థాయిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా.. ముఖ్యనేతలకు బైపోల్స్‌పై ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేస్తుండడం గమనార్హం. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ నేతలు బైక్ ర్యాలీలు చేపట్టేలా ప్లాన్ సిద్ధం చేశారు. బైక్ ర్యాలీలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండలాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేత లు పాల్గొనేలా ప్లాన్ చేశారు.
10న మునుగోడు బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశం నిర్వహించనున్నారు. నేడో రేడో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా అధికారికంగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనుంది.
మంచి రోజు చూసుకుని రాజగోపాలరెడ్డి నామినేషన్ వేస్తారని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు.. బీజేపీ దూకుడు పెంచడం ఖాయమనేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో.. చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.