Begin typing your search above and press return to search.
బీజేపీ దాగుడు మూతలు.. నష్టపోతోందెవరు?
By: Tupaki Desk | 7 Sep 2021 11:44 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు దాగుడు మూతలు ఆడుతున్నారా? ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా.. వ్యవహరిస్తున్నారా? దీనివల్ల నష్టపోయేదెవరు? ప్రాం తీయ పార్టీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం వల్ల.. బీజేపీకి ఒరిగేది ఏంటి? ఫలితంగా బీజేపీకి లభిం చేదేంటి? ఇవీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలను పరిశీలిస్తే.. ఇప్పుడు కాకపోయినా.. మరికొన్నాళ్లకయినా.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. వారు కలలు కంటున్నారు.
ఏపీలో పార్టీ చీఫ్ సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ చీఫ్ బండి సంజయ్‌లు.. ఒకే లక్ష్యంతో ముందుకు సాగు తున్నారు. ఏపీ కన్నా.. తెలంగాణలో బీజేపీకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నందున ఎట్టిపరిస్థితిలోనూ పార్టీని అధికా రంలోకి తీసుకువస్తామని.. బండి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాద యాత్ర కూడా చేస్తున్నారు. నేతలను సమీకరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమని.. ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా ప్రకటిస్తున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇంత దూకుడు కనిపించకపోయినా..ఎంతో కొంత ప్రభావం ఉంది.
సోము వీర్రాజు కూడా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెబుతున్నారు. జనసేనతో పెట్టుకు న్న పొత్తుతో తాము అధికారంలోకి వస్తామని.. కాపు నాయకుడికి సీఎం పగ్గాలు అప్పగిస్తామని కూడా ఆయ న చెబుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరి ఇంతగా రాష్ట్రాల్లో నేతలకు లక్ష్యాలు విధించిన బీజేపీ అధిష్టానం పెద్దలు.. తెరచాటున వ్యవహరిస్తున్న తీరు.. ఇప్పుడు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలను నిరాశలో ముంచెత్తుతోంది. ``మేం.. పుల్లా పుల్లా పేర్చి గూడు కడుతున్నాం. కేంద్రంలోని వారు అలా చేస్తున్నారు. ఏం చేయమంటారు?`` ఇదీ..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేత ఒకరు.. చేసిన వ్యాఖ్య.
అంటే.. ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతును కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆశిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో హ్యాట్రిక్ కొడతామో.. లేదో అనే భావన వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్న ప్రాంతీయ పార్టీలతో ఇప్పటి నుంచే మంతనాలు జరుపుతున్నారని.. కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీ నేతలతో.. బీజేపీ పెద్దలు వ్యూహాత్మక చర్చలకు తెరదీశారు. మరి.. రాష్ట్రంలో ఆయా పార్టీలపై పోరు చేస్తున్న నాయకులకు.. ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టవా? ప్రజల్లో వారు చులకన కారా? అంటే.. ఖచ్చితంగా అవుతారు. వారే కాదు.. బీజేపీ కూడా పలుచన అవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.