Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హీరోల చుట్టూ బీజేపీ పాలిటిక్స్..ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 27 Aug 2022 5:07 PM GMTఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా మూవీ `RRR`, `బాహుబలి`తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన టాక్ ఆఫ్ ద ఇండియాగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీతో చరణ్, ఎన్టీఆర్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఆస్కార్ కు కూడా ఈ మూవీ నామినేట్ కానుందని, ఎన్టీఆర్ కి అవార్డు రానుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ కావడం.. ఎన్టీఆర్ తో కలిసి ప్రత్యేకంగా డిన్నర్ చేయడం చర్చినీయాంశంగా మారింది. గత ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో నోవాటెల్ హోటల్‌లో ఎన్టీఆర్ తో అమిత్ షా ఆరగంట పాటు భేటీ కావడంతో ఏం జరుగుతోంది? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే అమిత్ షా మాత్రం `అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది` అంటూ ఎన్టీఆర్ తో కలిసి ఫొటోలని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం సంచలనంగా మారింది.
భేటీ తరువాత ఎన్టీఆర్ తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్లిపోగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం `RRR` లో ఎన్టీఆర్ నటన నచ్చడం వల్లే ఆయనని అభినందించడానికి ప్రత్యేకంగా పిలిచారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రధాన్యత లేదని సెలవిచ్చాడు.
దీనిపై భిన్న కథనాలు వినిపించాయి. ఇదిలా వుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ ప్రత్యేకంగా శనివారం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా సేమ్ నోవాటెల్ హోటల్ లో టాలీవుడ్ హీరో నితిన్ తో భేటీ కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నితిన్ తో పాటు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా వున్నారు.
బీజేపీ నేతలు వరుసగా టాలీవుడ్ హీరోలతో ప్రత్యేకంగా భేటీ ఎందుకు అవుతున్నారు? ఎన్టీఆర్ తో అమితా షా భేటీ కి కారణం ఏంటి అంటే `RRR` లో ఎన్టీఆర్ నటన నచ్చడం వల్లే ఆయనని అభినందించడానికి ప్రత్యేకంగా పిలిచారని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రధాన్యత లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెలవిచ్చాడు. మరి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని నితిన్ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రత్యేకంగా కలవడం వెనకున్న మతలబు ఏంటీ? అన్నది మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. ఓ స్ట్రాటజీ ప్రకారమే బీజేపీ నేతలు టాలీవుడ్ హీరోలని కలుస్తున్నారా? .. టాలీవుడ్ చుట్టూ బీజేపీ నేతల పాలిటిక్స్ ఏంటీ? .. ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఇప్పుడు హాట్ చర్చగా మారింది.