Begin typing your search above and press return to search.
ఏపీ పాలిటిక్స్ లో షర్మిల... జగన్ టార్గెట్ గా బీజేపీ....?
By: Tupaki Desk | 6 Dec 2022 3:43 PM GMTఏపీ రాజకీయాల్లో రాణించాలని బీజేపీకి ఉంది. కానీ సరైన లీడర్ షిప్ లేదు. అలాగే పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలి. దిగ్గజ నాయకులకు చెందిన వారి వారసులను చేర్చుకుంటే జనంలో కలసివస్తుందని బీజేపీ ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసుకుంటూ వస్తోంది. అందులో భాగమే దివంగత ఎన్టీయార్ తనయ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీలోకి తీసుకున్నారు.
అయితే ఆమె ప్రభావం చూపలేకపోతున్నారు. కోస్తా జిల్లాలలో కమ్మ సామాజికవర్గం ఓట్లను టీడీపీ నుంచి చీల్చి బీజేపీకి మేలు చేసే విషయంలో ఆమె ఒక విధంగా విఫలం అయ్యారనే అంటున్నారు. దీంతో బీజేపీ ఏకంగా టీడీపీని లొంగదీయాలని కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఒక వైపు బాబుని దువ్వుతూనే మరో వైపు టీడీపీ బాగా తగ్గిపోవాలని కోరుకుంటోంది.
ఇంకో వైపు జూనియర్ ఎన్టీయార్ ని కూడా దగ్గరకు తీస్తోంది. ఆయన ద్వారా ఏపీలో బలమైన కమ్మలతో పాటు మిగిలిన వారు కూడా తమ వైపుగా టర్న్ అవుతారు అని బీజేపీ యోచిస్తోంది. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ణి మిత్రుడుని చేసుకోవడం ద్వారా కాపుల ఓట్లకు గేలం వేస్తోంది.
అయితే ఇవన్నీ కూడా అధికార వైసీపీ ఓటు బ్యాంక్ ని ఏ విధంగానూ దెబ్బతీయలేవు. అధికార వైసీపీని కూడా టార్గెట్ చేస్తేనే ఏపీలో సరికొత్త ఓటు బ్యాంక్ తమకు స్థిరపడుతుంది అని బీజేపీ ఆలోచిస్తోంది అంటున్నారు. అందులో భాగమే వైఎస్ షర్మిలను ఇపుడు బీజేపీ తమ వైపుగా తిప్పుకుంటోంది అని అంటున్నారు.
వైఎస్ షర్మిల అంటే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. ఆమె వైఎస్సార్ తనయ. దాంతో సీమ జిల్లాలతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రభావం చూపవచ్చు అని కొత్త ఎత్తులు వేస్తోంది అని అంటున్నారు. హైదరాబాద్ లో షర్మిల అరెస్ట్ చేయడం ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంలో పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళడం ఇదంతా కూడా ఆమెకు ఓవర్ నైట్ జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేలా చేశాయి.
ఇక తెలంగాణా బీజేపీ నాయకులు అయితే వరసబెట్టి ఆమెకు మద్దతు ప్రకటించారు. గవర్నర్ తమిల్ సై కూడా ఆమె అరెస్ట్ దారుణం అన్నారు. ఇపుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ షర్మిలకు ఫోన్ చేసి పది నిముషాల సేపు మాట్లాడడం తెలంగాణాతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అయింది. టీయారెస్ మీద బీజేపీ వదిలిన బాణం షర్మిల అని ఆ పార్టీ వారు ఆరోపిస్తూ వచ్చారు. ఇపుడు మరింత బలపడేలా మోడీ ఫోన్ ఉందని అంటున్నారు.
మరో వైపు వైఎస్ షర్మిల ఆంధ్రా మూలాలు ఉన్న మహిళ. పైగా ఏపీలో సీమ జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ పవర్ ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ. దాంతో ఆమె సేవలను తెలంగాణాలో కంటే ఏపీలో ఎక్కువగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ పావులు కదుపుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. వైఎస్ షర్మిల జగన్ మధ్య విభేదాలను కూడా ఉపయోగించుకుని ఏపీలో వైసీపీ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక ఏపీలో షర్మిల పాదయాత్ర చేసి అన్న జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. అలాగే 2019 ఎన్నికల వేళ విశేష ప్రచారం చేశారు. ఆ తరువాత ఆమె దూరంగా ఉంటూ వచ్చి తెలంగాణాలో కొత్త పార్టీని పెట్టుకున్నారు. అయితే షర్మిలని బీజేపీ తమ వైపు తిప్పుకుంటే తెలంగాణాతో పాటు ఏపీలో కూడా బహుముఖ రాజకీయ ప్రయోజనాలను పొందవచ్చు అని ఆలోచిస్తోంది అంటున్నారు.
ఈ మధ్య ఒక టీవీ చానల్ లో షర్మిల మాట్లాడుతూ తాను పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నది ఎవరికో చాకిరీ చేయడానికి కాదని స్పష్టం చేశారు. తన సొంత పార్టీని తెలంగాణాలో అధికారంలోకి తెచ్చి తాను సీఎం అవుతాను అని ఆమె అంటున్నారు. అయితే వర్తమాన రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టి నిలదొక్కుకోవడం ఎవరికైనా కష్టమే.
చూడబోతే జాతీయ పార్టీ అయిన బీజేపీ మాస్టర్ ప్లాన్స్ కూడా వెరైటీగా ఉంటాయి. ఏపీలో పవన్ని ఒక వైపు పెట్టుకున్న బీజేపీ ఇపుడు వైఎస్ షర్మిలను కూడా కమలం గూడు వైపుగా తిప్పుకుంటే తెలుగు నాట సక్సెస్ కావచ్చు అని భావిస్తోందిట. మరి ఈ ప్రచారం నిజమైతే బీజేపీ టార్గెట్ చేస్తోంది జగన్నే అంటున్నారు. మరి అదే జరిగితే ఏపీలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడాల్సి ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.