Begin typing your search above and press return to search.
ప్రధాని సొంతూళ్లో మళ్లీ బీజేపీ జెండా
By: Tupaki Desk | 19 Feb 2018 7:03 AM GMTప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో మళ్లీ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్న డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కష్టంగా గట్టెక్కి అధికారం నిలబెట్టుకున్న ఆ పార్టీ రెండు నెలలకే బాగా కోలుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వస్తుండగా.. బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా సమాచారం అందేటప్పటికి మొత్తం 75 మున్సిపాలిటీలు, నగరపాలికల్లో 11 చోట్ల బీజేపీ గెలిచింది. మరో 44 చోట్ల ఆధిక్యంలో ఉంది. ప్రధాని సొంత ప్రాంతం వాధ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 28 స్థానాలకు గాను 27 చోట్ల బీజేపీ గెలవడం విశేషం.
కాగా గుజరాత్ లోని 75 మున్సిపాలిటీలు - కార్పొరేషన్లకు ఫిబ్రవరి 17న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈ రోజు వస్తున్నాయి. ఇంతకుముందు 2013లో ఎన్నికలు జరిగినప్పుడు 74 మున్సిపాలిటీల్లో 60 చోట్ల బీజేపీ జెండా ఎగిరింది. అయితే... 2014లో మోదీ దేశ ప్రధాని అయిన తరువాత గుజరాత్ కు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. మూడేళ్లలో ఇద్దరు సీఎంలు మారారు. మోదీ దేశ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత గుజరాత్ లో కాంగ్రెస్ మళ్లీ బలపడడం ప్రారంభించింది. బీజేపీ బలహీనమవుతూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కష్టమేనన్న అంచనాలూ వెలువడ్డాయి. కానీ.. మోదీ కాలికి బలపం కట్టుకుని తిరిగి పార్టీ విజయానికి సాయపడ్డారు.
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మోదీ సొంతూరు అయిన వాధ్ నగర్ లో బీజేపీ 28 స్థానాల్లో 27 గెలిచి తిరుగులేని విజయం నమోదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాధ్ నగర్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు సొంతూరిలో మోదీ హవా కనిపించడంతో బీజేపీలో సంతోషం కనిపిస్తోంది.