Begin typing your search above and press return to search.

అమిత్‌ షా ఇంత భ‌య‌స్తుడా?

By:  Tupaki Desk   |   12 Nov 2015 4:43 PM GMT
అమిత్‌ షా ఇంత భ‌య‌స్తుడా?
X
బీహార్ ఎన్నిక‌ల్లో ఘోర పరాజయం తరువాత భార‌తీయ జ‌న‌తాపార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం ప్రతి అడుగూ ఆచితూచి వేస్తోంది. పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు వచ్చే ఏడాది ఎన్నిక‌లు జరుగనున్ననేప‌థ్యంలో ఆ పార్టీ ప‌టిష్ట‌మైన వ్యూహంతో ముందుకువెళుతోంది. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం ఒకింత ఆలోచ‌న‌తో - వైఫ‌ల్యాల ఛాయ‌లు క‌నిపించ‌కుండా త‌న కార్య‌చ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

కోల్‌కతాలో ఈ నెల 30వ తేదీన 'ఉత్థాన్‌ దివస్‌' పేరిట చేపట్టదలచిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అమిత్‌ షా రద్దు చేసుకున్నారు! బ‌దులుగా డిసెంబర్‌ చివరివారంలో పశ్చిమ బెంగాల్‌ లో జరిగే వివిధ‌ బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోడీ - కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌ - అరుణ్‌ జైట్లీ మొదలైన వారు జనవరిలో వివిధ సభల్లో పాల్గొంటారు. బీహార్ ఫ‌లితాల నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే ఈ విధంగా చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే బీహార్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ముందే పశ్చిమ బెంగాల్‌ లో కార్యక్రమాలను వాయిదా వేయడం జరిగిందని బీజేపీ జాతీయ నేతలు చెప్పుకొస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ లో అమిత్‌ షా పాల్గొనే బహిరంగ సభను వాయిదా వేయాలని ఈ నెల 6వ తేదీన నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. ప్రచారానికి ముందే పార్టీ నాయకుల మధ్య చెలరేగుతున్న కలహాలు సద్దుమణగాలని ఆ పార్టీ జాతీయ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్‌ షా పర్యటనకు ముందే పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడు కైలాశ్‌ విజయవార్గీయ పశ్చిమ మిడ్నపూర్‌ లో సభ నిర్వహించనున్నారు.