Begin typing your search above and press return to search.
ఆమె ఇంట్లో అమిత్ షా
By: Tupaki Desk | 6 Jun 2018 5:57 PM GMTవచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల వద్ద తమ ప్రభుత్వ పనితీరును వివరించి వారి మద్దతు కోరుతున్నారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వ నాలుగేళ్ల విజయాలను వివరించే సమాచారమంతా తీసుకెళ్లి ప్రముఖులను కలుస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 100 మందిని గుర్తించారు. అందులో భాగంగా అమితాబ్ ను కలిసిన అమిత్ షా తాజాగా ఈ రోజు అలనాటి అందాల నటి మాధురి దీక్షిత్ ఇంటికి వెళ్లి ఆమెకు ఈ వివరాలన్నీ తెలిపారు.
ఇందుకోసం ముంబయి వెళ్లిన ఆయన మాధురి ఇంటికి వెళ్లి ఆమెకు - ఆమె భర్త శ్రీరామ్ నేనెకు మోదీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏమేం సాధించింది.. ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అనేది వివరించారు. అనంతరం ఆయన లతా మంగేష్కర్ - రతన్ టాటాలను కూడా కలవనున్నారు.
మరోవైపు ముంబయిలో ఆయన శివసేన చీఫ్ నూ కలిశారు. కొంతకాలంగా బీజేపీపై శివసేన పార్టీ తీవ్రంగా విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఎంతో కాలంగా తమకు మిత్ర పక్షంగా ఉంటోన్న శివసేన మద్దతు కూడగట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కలిసి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశం చర్చించినట్లు సమాచారం.