Begin typing your search above and press return to search.
బండి సంజయ్ కి అంత సీన్ లేదా...?
By: Tupaki Desk | 12 July 2022 1:30 PM GMTబీజేపీ హై కమాండ్ తాజాగా చేయించిన ఒక స్వీయ సర్వే ప్రకారం చూస్తే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు తెలంగాణా రాష్ట్రంలో దాదాపుగా ఎనభై శాతం మందికి తెలియదంట. వాస్తవానికి చూస్తే ఇది షాకే మరి. కేవలం పేపర్ చూసే వాళ్ళు, టీవీలను అనుసరించేవాళ్ళు తప్ప బండి సంజయ్ అన్న పేరు కానీ గ్రామీణ ప్రాంతం వారికి ఆయన ఎవరో అన్నది కానీ అసలు తెలియదుట. ఇలా బీజేపీ బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అంటూ చేయించిన సర్వే తరువాత హై కమాండ్ కి ఒక విషయం అర్ధమైందిట. ఉన్నంతలో కిషన్ రెడ్డి పేరే ఎక్కువ మందికి తెలుసు అని.
అలా బీజేపీ పెద్దలు చేయించిన సర్వేలో బండి సంజయ్ కంటే కిషన్ రెడ్డి పేరు తమకు తెలుసు అని చాలా మంది చెప్పారట. ఇక చిత్రమేంటి అంటే బండి సంజయ్ అన్న పేరు గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అసలు తెలియదు అని. ఈ విషయంలో కిషన్ రెడ్డి చాలా బెటర్ గా ఉన్నారట. ఆయన గురించి ఎక్కువ మంది జనాలు మాకు తెలుసు అని చెప్పడమే దానికి ఆధారం.
ఈ సర్వేతో బీజేపీ హై కమాండ్ కి తత్వం బోధపడింది అంటున్నారు. కేవలం బండి సంజయ్ ని నమ్ముకుని మొత్తం అతని మీద వదిలేస్తే పుట్టె మునగడం ఖాయమని కూడా భావిస్తున్నారుట. అలా కాకుండా ఉమ్మడిగా బీజేపీ నేతలు అంతా కలసి టీయారెస్ మీద పోరాడితేనే ఫలితాలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారుట.
ఇక బండి సంజయ్ ని నమ్ముకుని ఆయన మీదనే మొత్తం బీజేపీ బండి తోలే బాధ్యతలను అప్పగించలేమని కూడా బీజేపీ పెద్దలు గ్రహించారు అని అంటున్నారు. నిజానికి చూస్తే బండి సంజయ్ ఈ మధ్య కాలంలోనే పాపులర్ అయ్యారు. అది కూడా ఆయన ఎక్కువగా మీడియాలోనే కనిపిస్తున్నారు అన్న చర్చ ఉంది.
ఆయన ఎంతసేపూ కేసీయార్ ని ఆయన కుటుంబాన్ని విమర్శించడం ద్వారా హైలెట్ అయ్యారు తప్ప గ్రౌండ్ లెవెల్ లో కమలం పార్టీని పటిష్టం చేసేందుకు తగిన చర్యలు అయితే చేపట్టలేదని అంటున్నారు. అదే టైమ్ లో ఆయన తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా మొత్తం పార్టీ నాయకులను అందరికీ కలుపుకుని పోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. బండి సంజయ్ సింగిల్ గా తానే మొత్తం బండిని తోలేయాలన్న అతి ఉత్సహాం వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు.
ఏది ఏమైనా ఎన్నికలు ఏణ్ణర్ధం వ్యవధిలో ఉండగానే కేంద్ర బీజేపీ పెద్దలకు తెలంగాణాలో తమ అసలు పొజిషన్ ఏంటి అన్న దాని మీద ఒక అంచనా అయితే వచ్చింది అని అంటున్నారు. ఇక తాము బండి సంజయ్ బొమ్మతోనే కధ నడపాలని చూస్తున్నారు.
అయితే అధినాయకత్వం సత్వరమే మేలుకుంది. ఉమ్మడిగా బీజేపీ నిలబడితేనే తప్ప టీయారెస్ ని ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించడంతో పాటు బండి స్పీడ్ ఎంతో కూడా తూకమేసి మరీ గుట్టు లాగింది. దాంతో బండి సంజయ్ కి ఎంత సీన్ తెలంగాణాలో ఉందో హై కమాండ్ తో పాటు అందరికీ తెలిసి వచ్చింది అంటున్నారు.