Begin typing your search above and press return to search.
ఓలా క్యాబ్ తో పోలీసులకు బీజేపీ లక్ష్మణ్ షాక్!
By: Tupaki Desk | 29 April 2019 10:35 AM GMTనిరసనలు ఎవరు చేసినా.. ఆందోళనలు ఎవరు దిగినా.. ఒకటే మంత్రంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. నిరసనలకు అనుమతి ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే.. బలవంతంగా ఎవరైనా ఆందోళనలు చేస్తున్నారంటే చాలు.. సదరు నేతల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకోవటమో లేదంటే.. హౌస్ అరెస్ట్ చేయటం లాంటి పనులతో.. విపక్షాల ఎత్తుల్ని పారనీయకుండా చేసే పోలీసులకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఊహించని రీతిలో షాకిచ్చారు.
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం ఫెయిల్ కావటాన్ని నిరసిస్తూ.. విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తెచ్చిన లక్ష్మణ్.. నిరవధిక దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రే ఆయన్ను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్లుగా అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. పోలీసులు అలాంటిదేమీ చేయలేదు.
దీక్ష చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరటానికి ప్రయత్నించిన లక్ష్మణ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించారు. దీంతో.. ఆయన ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. పోలీసుల కళ్లు గప్పిన లక్ష్మణ్.. ఊహించని రీతిలో వ్యవహరించారు. తన ఇంటి నుంచి ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్న ఆయన.. ఇంటి ఆవరణ నుంచి నేరుగా క్యాబ్ లో బీజేపీ పార్టీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. ఓలా క్యాబ్ లో లక్ష్మణ్ బయటకు వెళతారని ఊహించని పోలీసులకు.. ఆయన చర్య షాకింగ్ గా మారింది. ఇంటి నుంచి బయటకు రాగానే లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించారు. వారి ఎత్తులు పారని రీతిలో లక్ష్మణ్ వ్యవహరించారు.
పోలీసుల కళ్లు గప్పి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. తన దీక్షను షురూ చేశారు. ఇటీవల కాలంలో ఎంతోమంది నేతలు దీక్ష తలపెట్టాలని చూసినా.. వారి ప్రయత్నాల్ని పోలీసులు భగ్నం చేయటం జరుగుతోంది. దీనికి భిన్నంగా లక్ష్మణ్ పోలీసులకే షాకివ్వటం ఆసక్తికరంగా మారింది.