Begin typing your search above and press return to search.

పొత్తుల్లో త‌ప్పులు స‌రే.. మీ సంగ‌తేంది ల‌క్ష్మ‌ణా?

By:  Tupaki Desk   |   15 Sep 2018 5:29 AM GMT
పొత్తుల్లో త‌ప్పులు స‌రే.. మీ సంగ‌తేంది ల‌క్ష్మ‌ణా?
X
ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చున్న నాటి నుంచి మోడీని గ‌మ‌నిస్తే.. బీజేపీ ఏలుబ‌డిలో లేని రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాలు.. ఆర్నెల్ల ముందు నుంచే వీకెండ్స్ లో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రానికి వెళ్ల‌టం.. బీజేపీ ఓటు బ్యాంకును పెంచే ప్ర‌య‌త్నం చేయ‌టం క‌నిపిస్తుంది.

ఈ తీరు కొన్నిరాష్ట్రాల్లో వ‌ర్క్ వుట్ కావ‌ట‌మే కాదు.. బీజేపీ చేతికి అధికారాన్ని వ‌చ్చేలా చేసింది కూడా. మ‌రి.. తెలంగాణ మీద తాము ఎప్ప‌టి నుంచో గురి పెట్టిన‌ట్లుగా చెప్పే బీజేపీ.. తెలంగాన‌లో జ‌రుగుతున్న‌ ముంద‌స్తు వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని మోడీ యాక్టివ్ గా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఓప‌క్క కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు అప‌విత్ర‌మ‌ని చెబుతున్న బీజేపీ నేత‌లు..ఇంకోవైపు టీఆర్ ఎస్‌- మ‌జ్లిస్ పొత్తు కూడా డేంజ‌ర్ గా అభివ‌ర్ణిస్తున్నారు.

మ‌రి.. ఈ మూడు పార్టీల గురించి చెబుతున్న బీజేపీ.. త‌మ పార్టీతో టీఆర్ ఎస్ కు సంబంధించిన ర‌హ‌స్య డీల్ ను కూడా బ‌య‌ట‌పెట్ట‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తాము ప‌వ‌ర్లోకి వ‌స్తామ‌ని మ‌జ్లిస్ నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తాము తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌ర్లోకి వ‌స్తామ‌ని చెప్ప‌టాన్ని ప్ర‌స్తావించారు.

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌కీయాల్ని తెలంగాణ రాష్ట్రంలో తెర తీస్తున్న‌ట్లుగా చెప్పారు. తాడు అనుకున్న మ‌జ్లిస్.. ఉరితాడుగా మారి టీఆర్ ఎస్‌ కు ముప్పుగా వాటిల్లుతుంద‌ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. మ‌జ్లిస్ లాంటి పాముకు పాలు పోసి పెంచుతున్న టీఆర్ ఎస్ కు ఏదో రోజు ముప్పు త‌ప్ప‌దంటూ హెచ్చ‌రిస్తున్నారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ ను బ‌తికించేందుకు టీడీపీ.. సీపీఐలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని.. అవేవీ అవినీతి కాంగ్రెస్ ను బ‌త‌క‌నీయ‌లేవ‌న్నారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ‌..పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స‌భ‌లు ఏయే ప్రాంతాల్లో ఉంటాయో చెప్పిన ల‌క్ష్మ‌ణ్.. ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌పై ఎందుకు గురి ఎట్ట‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు ల‌క్ష్మ‌ణ్ సూటి స‌మాధానం చెబితే బాగుంటుంది. అమిత్ షా పెట్టే స‌భ‌ల గురించి మా గొప్ప‌గా చెప్పే ల‌క్ష్మ‌ణ్ లాంటి వారు తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మోడీ ఎందుకు రావ‌టం లేదు? తాను అనుస‌రించిన వైనానికి తెలంగాణ విష‌యంలో మోడీ ఎందుకు మిన‌హాయింపు ఇస్తున్నార‌న్న స్ప‌ష్ట‌త ఇచ్చే ధైర్యం ల‌క్ష్మ‌ణ్ కు ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే.. పొత్తులు ప‌విత్ర‌మా? అప‌విత్ర‌మా? అని ప్ర‌శ్నించే ముందు.. బీజేపీ వైపు వేలెత్తి చూపుతున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల్ని ల‌క్ష్మ‌ణ్ లాంటి నేత‌లు ఇస్తే బాగుంటుంది.