Begin typing your search above and press return to search.

మోడీ ద‌ర్శ‌క‌త్వం..అమిత్‌ షా వ్యూహం..

By:  Tupaki Desk   |   15 Dec 2017 9:51 AM GMT
మోడీ ద‌ర్శ‌క‌త్వం..అమిత్‌ షా వ్యూహం..
X
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల‌ను వేడెక్కించేందుకు...త‌మ పార్టీని బ‌లోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మైంది. ఇందుకోసం జాతీయ పార్టీ ఆదేశాలు...మార్గ‌ద‌ర్శ‌కంగా వ‌హిస్తుండగా...తెలంగాణ రాష్ట్ర శాఖ త‌గు స్కెచ్‌ తో ముందుకు సాగుతోంది. ఈ ప్ర‌కారం వచ్చే నెల‌లో మొద‌ట బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రానుండగా...ఆ వెంట‌నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రానున్నారు. ఈ విష‌యాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు - ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ వెల్ల‌డించారు.

గుజరాత్ - హిమాచల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని తెలిపిన ల‌క్ష్మ‌ణ్‌ తెలంగాణపై ఆ ప్రభావం ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. భవిష్యత్ లో తెలంగాణలో పార్టీ గెలుపు ఖాయం చేస్తామ‌న్నారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా దృష్టి ఇక తెలంగాణపైనేన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈనెల 19 నుండి మూడురోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించబోతున్నామ‌ని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు. భవిష్యత్ లో అనుసరించవల్సిన ఎత్తుగడలు - వ్యూహాలు రూపొందించుకుంటామ‌ని తెలిపారు. తెలంగాణలో ఎస్సీ - ఎస్టీ - బీసీ మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ పనిచేస్తుందని ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దర్శకత్వంలో అమిత్ షా వ్యూహాలతో తెలంగాణాలో అధికారంలోకి వస్తాం ల‌క్ష్మ‌ణ్ ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాది జనవరి లో అమిత్ షా - ఫిబ్రవరిలో మోడీ తెలంగాణలో పర్యటిస్తారని వెల్ల‌డించారు. తెలంగాణాలో పాలకులు విస్మరించిన బీసీ - ఎస్సీ - ఎస్టీ వర్గాలకు దగ్గర అవుతామ‌ని ఆయ‌న తెలిపారు. లంబాడి-ఆదివాసీలతో ప్రభుత్వం తక్షణమే చర్చించాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్లను - ముస్లింలతో ప్రభుత్వం ముడిపెట్టడమే ఈ ఘర్షణలకు కారణమ‌ని ల‌క్ష్మ‌ణ్‌ ఆరోపించారు. ఎస్టీల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంతో చేస్తున్న దోస్తీకి భవిష్యత్ లో టీఆర్ ఎస్ మూల్యం చెల్లించుకుంటుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీసీలకు తాయిలాలు కాదు ..ఆత్మగౌరం పెంచేలా ప‌థ‌కాలు ఉండాలని ల‌క్ష్మ‌ణ్ డిమాండ్ చేశారు. ప్ర‌జలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ కుల మతాలను తీసుకొచ్చి గుజరాత్ లో భంగపడింద‌ని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పరిపాలనలో తెలుగు వాడకాన్ని పెంచాలని ల‌క్ష్మ‌ణ్‌ కోరారు.