Begin typing your search above and press return to search.

కేసీఆర్ బాహుబ‌లి..మోడీ బ్ర‌హ్మాస్త్రం

By:  Tupaki Desk   |   4 May 2017 1:53 PM GMT
కేసీఆర్ బాహుబ‌లి..మోడీ బ్ర‌హ్మాస్త్రం
X
తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు ఉన్న అవకాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న బీజేపీ నేత‌లు ఈ క్ర‌మంలో మాట‌ల ఎదురుదాడిని సైతం జోరుగా కొన‌సాగిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.లక్ష్మణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుపై ఆస‌క్తిక‌ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ వ‌రంగ‌ల్ స‌భ‌ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ల‌క్ష్మ‌ణ్ అధికార దుర్వినియోగం చేసినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వరంగల్‌ లో టీఆర్‌ ఎస్ నిర్వహించిన సభ సక్సెస్ కాలేదని లక్ష్మణ్ అన్నారు. సీఎం ప్రసంగంలో ప్రగతి ప్రస్తావనే లేదని, ప్రగతి నివేదన టీఆర్ ఎస్‌ కు ఇపుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ బాహుబలి అయితే త‌మ‌ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.త‌మ‌ బ్రహ్మాస్త్రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు. త‌మ అస్త్రం ముందు ఎవరూ పనిచేయరని ధీమా వ్య‌క్తం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలు మట్టి కరుస్తున్నాయని విశ్లేషించారు. తెలంగాణలో బీజేపీకి టీఆర్ ఎస్‌ కే పోటీ ఉంటుంద‌నే టీఆర్ ఎస్ నేత‌ల‌కు భయం పట్టుకుందన్నారు. మే నెల‌లో జ‌రిగే అమిత్‌షా ప‌ర్య‌ట‌న అంటేనే టీఆర్ ఎస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి అనుకూలంగా తెలంగాణలో మోడీ గాలి వీస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు.

ఇతర పార్టీల నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఎప్పుడూ రాజీనామా అస్త్రాలు సందించే కేసీఆర్...ఇప్పుడు ఎందుకు రాజీనామా అస్త్రాలు సందిచటం లేదని ప్ర‌శ్నించారు. కేసీఆర్ నిరాశ, నిసృహలో ఉన్నారని ల‌క్ష్మ‌ణ్‌ ఎద్దేవా చేశారు. ఆయన పక్కనే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ల‌క్ష్మ‌ణ్ విశ్లేషించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించ‌కుండా మౌనంగా ఉండిపోయారంటేనే ప‌రిస్థితులు అర్ధం చేసుకోవచ్చున‌ని విశ్లేషించారు. విద్యార్థుల బలిదానంతోనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ వైఖరిని తెలంగాణ యువత జీర్ణించుకోలేక పోతున్నారని ల‌క్ష్మ‌ణ్‌ మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/